Saturday, August 28, 2010
పాపం పిల్లకాకి!
Tuesday, August 24, 2010
ఒంగోలు శ్రీను గారూ
ఒంగోలు శ్రీను గారూ - రెండో సారి!
Monday, August 23, 2010
ఒంగోలు శ్రీను గారూ!
Sunday, August 22, 2010
ఈ హేటర్స్ చేసిన నీచపు పనులు మీకు తెలుసా?
సోదరి గారూ, అసలు ప్రతి దానికీ సీనియర్ల పేర్లను అనుకరిస్తూ పేర్లు పెట్టి ఎంత ఛండాలంగా రాశారో మీకు తెలుసా? ఇంకా రాస్తున్నరు చూశారా? ఈ బ్లాగు సంగతే చూడండి.. క్యోతి, పనికిమాలిన పెన్ను, కత్తి, భారారె - అసలు వీళ్ళ పేర్లు ఎందుకు వాడాలి వీళ్ళు? ఏమిటి వీళ్ళ ఉద్దేశం -ఎవర్నైనా ఏమైనా అనవచ్చుననా? వాళ్ళు ఏమి మాట్లాడినా ఎవరూ ఏమీ అనలేరు, అనరు అనే ధీమానా? మీరు చెప్పండి, వాళ్ళు ఈ పేర్లన్నిటినీ వాడారా లేదా? (సూచనాప్రాయంగా చెప్పారులెండి. అర్ధం చేసుకోకపోవటానికి మనమేమీ పసిప్రాయులం కాదు, పశుప్రాయులమూ కాదు). పోనీ ఎవరో కరో ఇద్దరో చేశారని అనుకుండ్దామండి, అందరూ ఉన్నారంటారా? ఎందుకు ఆ బ్లాగర్ల మీద వీళ్ళకు అంత ద్వేషం? సరే, ఎందుకో ద్వేషం ఉంది అండీ, ప్రతీ దానికీ వాళ్ళను ఎందుకు ఆడిపోసుకుంటున్నారు? ఏ చిన్న గొడవ ఐనా, వాళ్ళను ఇష్టం వచ్చినట్టు తిట్టటం ఏంటి? ఏదో ఒకరోజున నిజమేంటో తెలియకపోదు. ఆనాడు వాళ్ళు తిట్టిన తిట్లకు పరిహారం ఏంటి?
Friday, August 20, 2010
చూశారా వాళ్లు చేస్తున్న రభస!
ప్రస్తుతం వీళ్లేం చేస్తున్నారు అంటే, జాతరలలో పూనకాల పోతురాజుల లాగ వూగిపోతు గంతులేస్తున్నారు. వీళ్లు మన బ్లాగు ముంగిటిలోకి వచ్చినపుడు మర్యాదగా మాట్లాడి పంపించాలి. లేకపోతే మన బ్లాగులోనే దుకాణం పెట్టి, అందరూ చేరి రభస చేసి పోతారు. నేను వాళ్లకు అంత మర్యాద చెయ్యలేదు గదా అందుచేత నా బ్లాగుకు వాళ్లు ఆ మర్యాద ఇస్తున్నారు.
కొందరు బ్లాగరులు గుంపులు కట్టారని, వాళ్లు కొత్త బ్లాగర్లను హెరాస్ చేస్తుంటారని వీళ్లు మెడల్లో డోళ్లు కట్టుకుని టమటమా వాయించుకుంటూ అమెరికా నుంచి ఆఫ్రిక వరకు తిరిగారు. అసలు వీళ్లు చేసేది, చేస్తున్నది అదే -గ్రూపులు కట్టి, ఇతర బ్లాగర్లను హెరాస్ చెయ్యటం. బ్లాగుల్లో తిరుగుతూ తమకు నచ్చని వాళ్ల బ్లాగులో స్పాట్ పెట్టి, గాంగ్ మెంబర్స్ అందరూ అక్కడ చేరి, వాదన పెట్టుకుని రచ్చ చేస్తారు. ఎవరి బ్లాగుల్లోవాళ్లు తమకు నచ్చింది రాసుకుంటారు. వీళ్లకెందుకు? ఒకవేళ నచ్చకపోతే, దాన్ని విమర్శ చెయ్యవచ్చు. కాని దానికి కూడ పద్ధతి ఉంటుంది కదా! బ్లాగరును అవమానపరుస్తూ రాసి, హింసిస్తారు. ఒకడి వెంటనే పదిమంది వచ్చి అల్లరి అల్లరి చేస్తారు. తప్పనిసరి పరిస్థితిలో ఆ బ్లాగరు తానే వెనక్కి తగ్గాల్సి వస్తుంది. ఎవరో గ్రూపులు కట్టి హెరాసు చేస్తున్నారని చెప్పుకుంటూ, తాము చేసే పని ఇది. పైగా ఈ వ్యక్తిగత దాడులకు sanctity ఇచ్చుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు.
ఉదాహరణకు, నా మొదటి పోస్ట్ సంగతి చూడండి. అందులో నేను రాసినది ఏమిటి? వీళ్ల అల్లరి పెచ్చుమీరి పోయింది, హింస పెట్టెస్తున్నారు అని నేను గోల చేసాను. కానీ వీళ్లు అసలు విషయాన్ని పక్కన పెట్టి, ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేశారు. నేను మాలిక మీద ద్వేషంతో రాస్తున్నానట. ఏదో ఒక రంగు పులిమి, తమ మీద దాడి జరుగుతున్నట్లు ప్రచారం చేసి, ఆ పైన తమకు ఇష్టం వచ్చినట్లు తిట్టే ప్రయత్నం ఇది.
గతంలో కూడ, కొందరు బ్లాగర్లు గ్రూపులు కట్టి తమను ఎగతాలి చేసారని చెప్పి వాళ్ళను అనరాని మాటలు అన్నారు. బూతులు తిట్టారు. కొందరు బ్లాగర్లకు సంబంధాలు అంటగట్టి ప్రచారం చేశారు. నోరు ఉంది కదా అని తమకు నోటికి వచ్చినదల్లా రాశారు. అసహ్యంగా ప్రవర్తించారు. కూడలి తమకు ఎగెనెస్ట్ గా పని చేస్తుందని దాని మీద దాడి చేశారు. అందుకే మాలిక పెడుతున్నామని చెప్పారు. తరువాత, హారం భాస్కరరామి రెడ్డి తమమీద ఏదో దాడి చేశారని అతని మీద దాడి చేశారు. ఇప్పుడు కూడా, ఈ బ్లాగ్ ను ఆయనకే లింకు పెట్టారు.
అసలు నా ఈ బ్లాగ్ ను ఎంతమందితో లింకు పెట్టుతున్నారో చూడండి.. కొత్తపాళి, కత్తి, మహిళా బ్లాగరులు,.. వాళ్ల ఇష్టం. వాళ్ల టెక్నిక్ చూడండి, ఎక్కడా నేరుగా పేరు పెట్టరు, పేరు స్ఫురించేలా వేరే పేరుతో తిడతారు. వీళ్ల నాయకుడు వీళ్లకు బాగా కీ ఇచ్చి ఒదిలిపెడుతాడు, వీళ్లు రెచ్చిపోతారు. అతడు మధ్యమధ్యలో వచ్చి నాలుగు బూతులు రాసి పోతాడు. భలే రాసావు అన్నయ్యా అంటూ వీళ్లు మరింతగా రెచ్చి గంతులేస్తారు.
అసలు తిట్టడమేమిటి? బరితెగించిన వాళ్లు ఎట్లా మాట్లాడినా, ఎటువంటి బూతులు రాసినా చెల్లుతుందని అనుకుంటున్నారా? అనుకుంటున్నట్లే ఉన్నారు. నా బ్లాగులో వాళ్లు రాసిన కామెంట్లు చూసినా, వాళ్ల బ్లాగుల్లో వాళ్లు రాస్తున్న కామెంట్లు చూసినా అలాగే అనిపిస్తుంది. ఈ అసభ్య రాతల నుండి తెలుగు బ్లాగరులకు మోక్షం ఎప్పుడో కదా!!
Thursday, August 19, 2010
ఈ బ్లాగును సంకలినులలో చూపవద్దు
ఈ బ్లాగును మీ సంకలినుల్లో చూపితే సంతోషం. కానీ ఇక్కడి వ్యాఖ్యలను మాత్రం చూపకండి. బ్లాగుల్లో చెత్త వ్యాఖ్యలు రాస్తు పనికిరాని పోసుకోలు కబుర్లు చెబుతూ, ప్రవీణ్ని తిట్టటం అనే ఏకైక అజెండాతో రాసే ప్రవీణ్-హేటర్ల గుంపు ఒకటుందని మీకు తెలుసు. ఆ రాతలతో విసుగెత్తటం వల్ల నేను ఒక పోస్ట్ రాసాను. దాంతో వాళ్లు ఇక్కడికి కూడా తయారయ్యారు. ఇక్కడ కూడా హేటురాతలు రాస్తున్నారు. ఎప్పటి లాగానే ఎందుకూ పనికిరాని చెత్త అది. మనసులు పాడవటం, టైమ్ వేస్ట్ అవటం తప్పించి వాటి వలన మరో ప్రయోజనం ఉండదు. అంచేత నా బ్లాగ్ నుంచి వ్యాఖ్యలను తీసుకోవద్దని మనవి.
Wednesday, August 18, 2010
తెలుగు బ్లాగరుల్ని రక్షించండి బాబోయ్!
నా టెంప్లేటు చూసారు కదండి. బాక్ గ్రౌండులో చాల బుక్సున్నాయి. అవి ఏ పుస్తకాలో తెలియదు. రకరకాల రంగుల్లో, షేపుల్లొ ఉన్నాయి. (అయితే వాటికి పేరూ ఊరూ లేదు అనుకోండి.) ఏ బుక్ తెరిచిచూస్తె ఏమి ఉంటుందో తెలియదు. ఏదో ఒక పుస్తకం చదవాలని మనం వచ్చాం. అవన్నీ మనకు నచ్చని పుస్తకాలే అనుకోండి. ఏమిటి మన పరిస్థితి? ప్రస్తుతం తెలుగు బ్లాగ్ల స్థితి అలా ఉంది. బ్లాగ్ అగ్రిగేటర్స్ అనే పుస్తకాల రాక్లో ఎక్కువగా బూతు పుస్తకాలే ఉన్నాయి. ఐతే, అన్నిటికీ అట్ట మీద రాసే ఉంది, బూతు పుస్తకమని. మంచి పుస్తకం గంజాయి వనములో తులసి మొక్కలా అయిపోయింది. ఏ కూడలికి వెళ్ళి చూసినా, ప్రవీణ్ ను తిడుతూ రాసే పోస్టులే. తిడుతూ రాసే కామెంట్లే!! ఒక గుంపు తయారయ్యింది. వీళ్లకి ఆ ప్రవీణ్ మీద పడి ఏడవటం తప్పించి వేరే పని ఉన్నట్టు లేదు. వీళ్లు ఏడిస్తే నాకు పోయేదేమీ లేదు కానీ, కూడలి, హారం, జల్లెద, మాలిక -ఎక్కడికి పోయినా ఈ దరిద్రం చూడలేక చచ్చిపోతున్నాను. అందుకే ఈ పోస్టు.
ఈ పనికిమాలిన గాలి గుంపు వచ్చాక బ్లాగులు, వ్యాఖ్యలు చూడాలంతే చిరాకు వచ్చేస్తోంది. పోస్టులో పెద్ద కంటెంట్ ఏమీ ఉండదు. ఏదో ప్రవీణ్ను తిడుతూ నాలుగైదు వాక్యాలుంటాయి. ఇక ఆ తరువాత ఆ బాచ్ వాళ్లందరూ అక్కడ చేరతారు. ప్రవీణ్ని తిడుతూ, ఎగతాళి చేస్తూ వందలాది కామెంట్లు రాస్తారు. అనుచితంగా ఉండని కామెంట్లు చాలా తక్కువ. ఒక 10, 15 మంది ఉంటారు ఈ గుంపులో. అందరూ కలిసి ఒక ఐదారు వందల nasty comments రాస్తారు. చివరికి పరిస్థితి ఎలా తయారు అయ్యిందంటే ప్రస్తుతం ఈ రౌడీలు అందరి కంటే కూడా ఆ ప్రవీణే చాలా నయమని అనిపిస్తుంది నాకు. ప్రవీణ్ మీద నాకు ప్రత్యేకమైన అభిమానము ఏమీ లేదు, కానీ అన్యాయమైన వ్యక్తిగత దాడికి, పిచ్చివాళ్ళ గుంపు యొక్క నీతిమాలిన తిట్లకు అతడు బలి అవుతున్నాడని నాకు అనిపిస్తుంది.
ఇలా ప్రవీణ్ను తిట్టటం మర్యాదగా ఉందా అని ఈ మధ్య అజ్నాతలు వీళ్లకు గడ్డి పెట్టబొయ్యారు. కానీ గడ్డి తినటానికే అలవాటు పడినవాళ్లకు మనం గడ్డి వేస్తే అది పరమానందం కదా, పరమాన్నమే కదా! ఈ గుంపులో ఉన్న ఒక ఆడమనిషికి బాగానే గడ్డి పెట్టారు ఒక అజ్నాత. కానీ ఆమె దులిపి వేసుకు పోయింది. అలా ఉంది వీళ్ల మూర్ఖత్వము! వీళ్ళలో ఒకళ్ళిద్దరు తమ బ్లాగుల్లో చక్కగానే రాస్తుంటారు. ఇతర బ్లాగుల్లో మాత్రం ఇలాంటి చెత్త రాస్తారు.
అయితే వీళ్ళు చాలా బెటర్ రా బాబూ అనిపించే మనిషి(?) ఒకతను ఉన్నాడు. అతడే శరత్ కాలం. బూతులు కూస్తూ అదే శ్రుంగారం అనుకుంటాడు అతడు. పైగా అది మనలని నమ్మామంటాడు. అతడు అమాయకుడో అమ్మాయకుడో అర్థం కాదు. అబ్బాయకుడిని అని చెప్పుకుంటాడు. అతడు ఎలా చెప్పుకున్నా, మనం ఒకటి మాత్రం చెప్పవచ్చు, మనిషికి ఉండాల్సిన కొన్ని కనీస మాన మర్యాదలు కొద్దిగా తక్కువ అతడికి. ఉదాహరణ చెప్పాలంటే, తన భార్య గురించి అవతలి వాళ్ళు ఏమని అనుకుంటారో అని కూడా ఆలోచించకుండా అతడు రాసే రాతలు. అతడి బ్లాగులు చదవకపోవడం ఆమె అద్రుశ్టం. ఈ మధ్య అతడు రాసిన పోస్టు చూశారా? ఆడవాళ్ళు తమని మొదటిసారి రేప్ ఎప్పుడు చేశారు, ఎవరు చేశారు వగైరాల లాంటివి తమ బ్లాగుల్లో రాయాలని భోధించాడు!! ఇలాంటి మెంటాలిటి ఉన్నవాడు మనిషేనా అని అనుమానంతో (?) పెట్టటం తప్పా చెప్పండి. అలాగే తను అమెరికా వెళ్ళినప్పుడు సరైన మర్యాదలు చెయ్యలేదని అతడు ఒకరిద్దరు బ్లాగర్ల మీద క్రూరమైన నిందలు వేశాడు.
ఇవన్నీ వాల్లు రాసుకుంటే నీకు బాధ ఏంటి? నీకు నచ్చకపోతే చదవకు అని అనవచ్చు. ఒకవేళ అది సరి అయిన మాట అయితే, ఈ లోకంలో విమర్శ అనేదే ఉండకూడదు కదా! ఏమంటారు? పుస్తకంపై రివ్యు రాసేవాడిని నీకు నచ్చకపోతే చదవొద్దు, సినిమా రెవ్యు రాసేవాడికి నీకు నచ్చకపోతే చూడొద్దు అని చెబుతారా?