Tuesday, September 21, 2010

ఎందుకు? ఏమిటి? ఎలా?

లూలూ, లుల్లాయ్ వంట చేస్తున్నారు. As usual, లూలూ వండుతుంటే లుల్లాయ్ హెల్ప్ చేస్తున్నాడు. అసిస్టెంట్ కదా!
లూలూ: రేయ్ లుల్లాయ్, సాల్ట్ తీసుకురారా!
లుల్లాయ్ సాల్ట్ బాక్స్ తెచ్చి
"ఇదుగో" అన్నాడు.
లూలూ: ఏంటిది?
లుల్లాయ్: సాల్ట్
లుల్లూ: ఏంటి గారంటి?
లుల్లాయ్ అయోమయంగా చూసి, "ఇది సాల్టే అన్నాయ్" అన్నాడు.
లూలూ: గారంటి ఏంటోయ్? దీని మీద రాసి ఉందా?
లుల్లయ్: లేదు.
లూలూ: అయితే ఇది సాల్ట్ కాదు అంతే. ఫో సాల్ట్ తీసుకురా పో!
లుల్లాయ్ మనసులో "ఈ తిక్కలోడి బాధ ఎప్పుడు ఒదులుతుందో" అనుకుని కొద్దిగా తిని చూసి, "ఇది ఉప్పే అన్నాయ్, ఉప్పగానే ఉంది"
లూలూ: ఐనా సరే, దాని మీద రాసి ఉంటేనే అది ఉప్పు, లేకపోతే నేనొప్ప.

లుల్లాయ్: ఛీ ఛీ, ఈ జప్ఫా గాడి దగ్గర బతికే కంటే...
----------------------
లూలూ, లుల్లాయ్ కారత్ చలంను కలవటానికి అతడుండే జంభారా హిల్స్ కు వెళ్లారు.
దారిలో లుల్లాయ్ చెబుతున్నాడు "కారత్ చలం వేటకుక్కల్ని పెంచుతూంటాడట బాస్, అవి చాలా ఫెరోశస్ అట, హైలీ డేంజరస్ అట"
లూలూ కళ్ళు పెద్దవి చేసి, "ఓహో అలాగా, మామూలు కుక్కల్ని పెంచుకోవచ్చుగదా, వేట కుక్కలు ఎందుకో"
లుల్లాయ్ "ఏమో బాసూ, నీ అంతటి తెలివైన వాడికే తెలియక పోతే, నాకేం తెలుస్తుంది?" అన్నాడు.

మరి కొంత సేపట్లో ఇద్దరు కారత్ చలం ఇంటి వద్దకు చేరుకున్నారు. లూలూ గేట్ తీయబోతూ ఉండగా లుల్లాయ్ ఆపి "అన్నాయ్, కుక్కలు ఉన్నాయని చెప్పారు గదా, తీయకు" అన్నాడు.
లూలూ "ఏదీ ఇక్కడ బోర్డ్ లేదు కదా?"
"చలం చాలా చాలూ కదా. బోర్డ్ పెట్టలేదేమో"
"నేను ఒప్పుకోను, బోర్డ్ లేకపోతే డాగ్స్ లేనట్లే, పద వెల్దాం" అని గేట్ తీయబోయాడు.

అప్పుడే కుక్కలు పరుగెత్తుకుంటూ గేట్ దగ్గరికి వచ్చాయి.

"అన్నాయ్, అవిగో కుక్కలు. ఎంత భయంకరంగ ఉన్నాయో చూడు, టైగర్ల లాగా. ఒకటి కాదు రెండు కాదు, మూడు. నోట్లోంచి చొంగ చూడు ఎట్లా కారుతుందో"

"నోర్ముయ్, "ఇక్కడ కుక్కలు ఉన్నాయి జాగ్రత్త" అని బోర్డ్ లేదు, కాబట్టి కుక్కలు లేవు అంతే! రావెల్దాం" అని గేట్ తీయబోయాడు.

"అన్నాయ్" అని పెద్దగా, కుక్క కరిచిన వాడి లాగా అరిచి, ఆపాడు. "ఎదురుగా కుక్కలు కనబడుతుంటే లేవు అంటావు ఏంటి బాసూ?" అన్నాడు ఏడుపు గొంతుతో.

"వాటిని కుక్కలు అంటారా? అయితే, కుక్కకు డెఫినిశన్ చెప్పు"

దెబ్బకు డంగై పోయిన లుల్లాయ్ పిచ్చి చూపులు చూడటం తప్ప ఇంకేమీ మాట్లాడలేకపోయాడు. అదే అదనుగా లూలూ గేటు తీసి లుల్లాయ్ ని ముందుకు తోసి, వెనుక తాను నడిచాడు.

Sunday, September 19, 2010

లోలూ, ది చాలూ!

పోర్న్ బ్లాగులు అగ్రిగేటర్స్లో చూపించాలా లేదా అనే డిస్కషన్ జరుగుతుంది. మాలిక, శరత్ ల మధ్య ఇస్యూ స్టార్ట్ అయింది. కాగడను చూపిస్తున్నావ్ కదా, నా బూతు బ్లాగ్ ఎందుకు చూపించవు అని శరత్ అడుగుతున్నాడు.

లోల్ (మలక్కు) చెప్పేది చదువుతుంటే నవ్వు వస్తుంది. బూతు అనే టాగ్ పెట్టెస్తే చూపించడు. ఆ టాగ్ లేకపోతే ఏ బూతు రాసుకున్నా పట్టించుకోరట. బూతు చూపించకూడదు గదా అని అడుగుతే, అసలు బూతు అంటే ఏంటి అని రివర్సు అడుగుతున్నాడు. అతడి సంగతి తెలియనిది ఏముంది?

లోలూ (మలక్కు)ది మహా కేటు బుర్ర! ఇదే ముక్క వీవెన్ ఒకప్పుడు అడిగితే అతడు, అతడి అనుచరుడు అరిచి, గోల చేసి, నీతులు చెప్పారు. ఇప్పుడు అతడు సరిగ్గా అదేపని చేస్తున్నాడు.

ఊరు అంతకీ జోష్యం చెప్పే బల్లి, కుడితి గాబులో పడిందట. అలా ఉంది ఇతడి పద్ధతి. ప్రీవియస్ పోస్ట్లో ఒంగోలు వారి హిపోక్రసీ చూశాం. ఇప్పుడు లోలూ (మలక్కు) వంతు.

లోలూ, బల్లి కబుర్లు ఆపి పని చూసుకోవోయ్.