Tuesday, September 21, 2010

ఎందుకు? ఏమిటి? ఎలా?

లూలూ, లుల్లాయ్ వంట చేస్తున్నారు. As usual, లూలూ వండుతుంటే లుల్లాయ్ హెల్ప్ చేస్తున్నాడు. అసిస్టెంట్ కదా!
లూలూ: రేయ్ లుల్లాయ్, సాల్ట్ తీసుకురారా!
లుల్లాయ్ సాల్ట్ బాక్స్ తెచ్చి
"ఇదుగో" అన్నాడు.
లూలూ: ఏంటిది?
లుల్లాయ్: సాల్ట్
లుల్లూ: ఏంటి గారంటి?
లుల్లాయ్ అయోమయంగా చూసి, "ఇది సాల్టే అన్నాయ్" అన్నాడు.
లూలూ: గారంటి ఏంటోయ్? దీని మీద రాసి ఉందా?
లుల్లయ్: లేదు.
లూలూ: అయితే ఇది సాల్ట్ కాదు అంతే. ఫో సాల్ట్ తీసుకురా పో!
లుల్లాయ్ మనసులో "ఈ తిక్కలోడి బాధ ఎప్పుడు ఒదులుతుందో" అనుకుని కొద్దిగా తిని చూసి, "ఇది ఉప్పే అన్నాయ్, ఉప్పగానే ఉంది"
లూలూ: ఐనా సరే, దాని మీద రాసి ఉంటేనే అది ఉప్పు, లేకపోతే నేనొప్ప.

లుల్లాయ్: ఛీ ఛీ, ఈ జప్ఫా గాడి దగ్గర బతికే కంటే...
----------------------
లూలూ, లుల్లాయ్ కారత్ చలంను కలవటానికి అతడుండే జంభారా హిల్స్ కు వెళ్లారు.
దారిలో లుల్లాయ్ చెబుతున్నాడు "కారత్ చలం వేటకుక్కల్ని పెంచుతూంటాడట బాస్, అవి చాలా ఫెరోశస్ అట, హైలీ డేంజరస్ అట"
లూలూ కళ్ళు పెద్దవి చేసి, "ఓహో అలాగా, మామూలు కుక్కల్ని పెంచుకోవచ్చుగదా, వేట కుక్కలు ఎందుకో"
లుల్లాయ్ "ఏమో బాసూ, నీ అంతటి తెలివైన వాడికే తెలియక పోతే, నాకేం తెలుస్తుంది?" అన్నాడు.

మరి కొంత సేపట్లో ఇద్దరు కారత్ చలం ఇంటి వద్దకు చేరుకున్నారు. లూలూ గేట్ తీయబోతూ ఉండగా లుల్లాయ్ ఆపి "అన్నాయ్, కుక్కలు ఉన్నాయని చెప్పారు గదా, తీయకు" అన్నాడు.
లూలూ "ఏదీ ఇక్కడ బోర్డ్ లేదు కదా?"
"చలం చాలా చాలూ కదా. బోర్డ్ పెట్టలేదేమో"
"నేను ఒప్పుకోను, బోర్డ్ లేకపోతే డాగ్స్ లేనట్లే, పద వెల్దాం" అని గేట్ తీయబోయాడు.

అప్పుడే కుక్కలు పరుగెత్తుకుంటూ గేట్ దగ్గరికి వచ్చాయి.

"అన్నాయ్, అవిగో కుక్కలు. ఎంత భయంకరంగ ఉన్నాయో చూడు, టైగర్ల లాగా. ఒకటి కాదు రెండు కాదు, మూడు. నోట్లోంచి చొంగ చూడు ఎట్లా కారుతుందో"

"నోర్ముయ్, "ఇక్కడ కుక్కలు ఉన్నాయి జాగ్రత్త" అని బోర్డ్ లేదు, కాబట్టి కుక్కలు లేవు అంతే! రావెల్దాం" అని గేట్ తీయబోయాడు.

"అన్నాయ్" అని పెద్దగా, కుక్క కరిచిన వాడి లాగా అరిచి, ఆపాడు. "ఎదురుగా కుక్కలు కనబడుతుంటే లేవు అంటావు ఏంటి బాసూ?" అన్నాడు ఏడుపు గొంతుతో.

"వాటిని కుక్కలు అంటారా? అయితే, కుక్కకు డెఫినిశన్ చెప్పు"

దెబ్బకు డంగై పోయిన లుల్లాయ్ పిచ్చి చూపులు చూడటం తప్ప ఇంకేమీ మాట్లాడలేకపోయాడు. అదే అదనుగా లూలూ గేటు తీసి లుల్లాయ్ ని ముందుకు తోసి, వెనుక తాను నడిచాడు.

21 comments:

  1. హ్హ హ్హ హ్హ హ్హ భాసు,
    నవ్వాగలేక చస్తున్నా...
    వెరిగుడ్ సటైర్..

    ReplyDelete
  2. >> "వాటిని కుక్కలు అంటారా? అయితే, కుక్కకు డెఫినిశన్ చెప్పు"

    ఈ రూలు మెము కుక్క పుట్టినప్పటినుండె పెట్టుకున్నాం
    ఒకసారి మా మూడు రూల్స్‌ను చూడండి

    ReplyDelete
  3. LOOOOOOOOOOOOOL....

    ReplyDelete
  4. హ హ. చాలా బావుంది మీ వ్యంగ్యం.

    ReplyDelete
  5. >>"వాటిని కుక్కలు అంటారా? అయితే, కుక్కకు డెఫినిశన్ చెప్పు"

    LOL

    btw, మా కుక్క పుట్టినప్పుడే మెము నిర్వచించాం
    కావలంటే మా మూడ్ రూల్స్‌ను చదవండి.

    ReplyDelete
  6. "న్యూ" సినిమాలా ఉంది
    హి హి హి

    ReplyDelete
  7. adirindi andi. Super

    ReplyDelete
  8. పచ్చి పంది కూరలా పసందుగా వుంది, నీ పోస్ట్.

    ReplyDelete
  9. కీలెరిగి వాత.

    ReplyDelete
  10. ప్రమాదవనానికి బ్లాగువీక్షణం!
    కుక్కకాటుకు చెప్పుదెబ్బ!!

    నూరు బ్లాగ్లను తిన్న రౌడీ, ఒక్క జాలవీక్షణలో మటాషై పోతున్నాడు!

    ReplyDelete
  11. A very good post in this blog.
    కెబ్లాసా ఎవరినైనా కెలకచ్చు. ఏమైనా అనచ్చు. మేము యువకులం. ఎవరికో అడ్డుపడి సాధించేసి ఏదో పొడిచేసి బ్లాగులు స్వేచ్చాయుతంగా రాసుకోడానికి కష్టపడిపోయాం అని పోస్ట్లొకటి. కాగడాకి వాళ్ళ పూర్తి మద్దత్తు ఉందని అర్థమవుతూందిగా.

    ReplyDelete
  12. వీక్షణ్ ఆ త్రాష్టుడే ఎలా బయట పడింది? అనవసరంగా భరారే, పాళీలను అనుమానించారు.
    ____________________________________________________


    హె హె హె హే హే హే.. కొత్త ఇసయం బా కనిపెట్టావు లోలు

    ReplyDelete
  13. కెవ్వు కేక రచ్చ రచ్చ ఇజిల్స్

    ReplyDelete
  14. >> ఇన్ని రోజులూ డప్పుకొట్టి దరువేస్తే ఎమైనా గిట్టుబాటు అవుతుంది అనుకున్నారు, కాదని తెలియగానే అసలు రంగు బయట పెట్టుకున్నరు. మీ రసజ్ఞ బ్లాగు కలపము అని చెప్పగామే మాలిక చేస్తున్నదల్లా తుస్సు, బుస్సు అని డిసైడ్ అయొపోయారు. మేము ఎప్పుడూ మీ మద్దతు అడగలేదు. డప్పుకొట్టమని చెప్పలేదు. మీరేదో ఊహించుకును, చేసుకున్నదే తప్ప మరేమీ లేదు. మాలిక ద్వారా ఎప్పుడూ పొడుస్తాము, ఊడబీకుతాము అని చెప్పలేదు.


    విన్నావా బజారు శీను, నీకు కూడ ఇదే గతి. వీళ్ళు మనుషుల్ని వాడుకొని వదిలేసే రకాలే. నేనెదో నీకు వ్యతిరేకం కాబట్టి చెప్తున్నానకుకోకు, జాగరత్త బిడ్డ.

    ReplyDelete
  15. ఈ సారి నీ పెరడీ మస్తుగ పండిందన్నా...
    నీకు నువ్వే సాటి

    ReplyDelete
  16. ఇది దేనికి పేరడీ కాస్త చెపుతారా ?

    ReplyDelete
  17. :)))))))))))))) ROFL

    retort to this in the other blog simply pales in comparision.

    You are rocking..

    ReplyDelete
  18. >> ఇది దేనికి పేరడీ కాస్త చెపుతారా ?

    abba chaa... niaku baagaa telusunani naaku telusu.

    ReplyDelete