Saturday, October 16, 2010

ఆఫ్ లుల్లూ బై లుల్లూ ఫర్ లుల్లూ!

బ్లాగ్ డెమాక్రసీ పరిరక్షణ సమితి సమావేశం జరుగుతుంది అక్కడ. సమితి ప్రెసిడెంట్ లుల్లూ, క్లర్క్స్ లుల్లాయ్, కారుతిక్క ఉన్నారు అక్కడ. వాళ్లతోపాటు కారత్ చలం కూడ ఉన్నాడు. అతడు ఈ సమితిలో మెంబర్ కాదు. కానీ ఎక్కువగా అక్కడికి వస్తు ఉంటాడు. అతడు కామెడీ కబుర్లు చెబుతాడు కాబట్టి, కాస్త ఎంటర్టైనింగ్గా ఉంటుందని వాళ్లు అతణ్ణి పిలుస్తారు. అక్కడికి వెళ్తే తనకు అవసరమైన ఎంటర్టైన్మెంట్ తనకు దొరకక పోతుందా అనే ఆశ అతడికి.

లుల్లూ: "కారత్, నీ అసిస్టెంట్లు ఎవరూ రాలేదా?"
కారత్ చలం: "అసిస్టెంట్లా? ఎందుకు?"
లుల్లూ: "అదేంటి, మనలాంటి బ్లాగ్ బాస్ లకు అసిస్టెంట్లు లేకపోతే ఎట్లా? నాకు చూడు ఇద్దరు ఉన్నారు."
కారత్ చలం: "నాదగ్గర అసిస్టెంట్లుగా ఉండటానికి ఎవరూ ఇష్టపడటం లేదు లుల్లూ. ఎందుకో అర్థం అవటం లేదు."
నాకు తెలుసులే అని లుల్లూ మనసులో అనుకున్నాడు.
కారత్ చలం: "అయినా అసిస్టెంట్లను పెట్టుకుంటే మనీ వేస్టు కదా?"
లుల్లూ: "మనీ ఎందుకు? రోజుకు నాలుగో అయిదో హాఫ్ చాయ్ లు, వీక్లీ వన్స్ బిరియానీ. ఈమాత్రం కూడా పెట్టలేవా?"
కారత్ చలం: "అంతేనా? ఇంత చీపా!! లుల్లూ, నాకు కూడా ఒకళిద్దరు అసిస్టెంట్లను చూసి పెట్టవా?"
లుల్లూ లుల్లాయ్, కారు తిక్కలవంక చూశాడు. వెంటనే వాళ్లు ఇద్దరు లుల్లూ వెనక్కి పోయి దాక్కుని "ఒద్దొద్దు అన్నాయ్" అని కోరస్గా అరిచారు.
లుల్లూ: "సరే, సరే! మిమ్మల్ని ఇవ్వనులే. మరి నామీద ఎవరైనా జోకులు వేసినా నవ్వకుండా ఉంటారా?"
లుల్లాయ్, తిక్క: "నవ్వం నవ్వం"
లుల్లూ: "నేను జోకులు వేసినపుడు నవ్వి తీరాలి"
లుల్లాయ్, తిక్క: "నవ్వుతాం నవ్వుతాం"
కారత్ చలం లుల్లూను ఎడ్మైరింగ్గా చూస్తు ఉండగా, లుల్లూ అన్నాడు "ఇప్పుడు చెప్పు కారత్, ఎందుకు కలుద్దామని అన్నావ్?"

అసలు వీళ్ల మీటింగు ఎందుకంటే, ధర్మ అనే ఒక పెద్దాయన తన బ్లాగుల్లో ఇండియన్ ట్రెడిషనల్ సైన్సెస్ గురించి రాస్తున్నాడు. అతడు బ్లాగ్ డెమాక్రసీ పరిరక్షణ సమితి పర్మిషన్ తీసుకోలేదు. అది సమితికి నచ్చలేదు. దాన్ని అలాగే వదిలేస్తే బ్లాగుల్లో డెమాక్రసీ దెబ్బతినిపోతుందని వీళ్లు భయపడిపోయి, ఆ ప్రమాదాన్ని అడ్డుకోవాలని అనుకున్నారు. కారత్ చలంది డిఫరెంట్ ఐడియాలజీ! బ్లాగుల్లో బండబూతులు రాసుకోవాలి గానీ, ఇండియన్ సైన్సెస్ గురించి రాస్తే తప్పు కదా! అందుకని అతడు ఈ మీటింగ్ ప్రపోజల్ పెట్టాడు.

కారత్ చలం: "లుల్లూ, ఆ ధర్మ బ్లాగును ఎలాగైనా ఆపాలి. ఏంచేద్దాం?"
లుల్లాయ్: "వాడి బ్లాగులో బూతులు రాద్.."
లుల్లూ తనకేసి కోపంగా చూడటంతో సగంలో ఆపేశాడు. ఏం మాట్లాడినా లుల్లూయే మాట్లాడాలి, ఏదైనా చెయ్యాలంటే క్లర్కులు చెయ్యాలి. డెమాక్రసీ కదా! లుల్లాయ్ నోటి దురద కొద్దీ వాగుతుంటాడు. లుల్లూ అలుగుతు ఉంటాడు.
లుల్లూ: "ముందు అతడి బ్లాగులో ఇదేం బాగోలేదని రాద్దాం."
లుల్లాయ్: "అది చాలదు అన్నాయ్. మన బ్లాగుల్లో బూతులు రాయాల్సిందే.."
లుల్లూ: "రేయ్ లుల్లాయ్, లుల్లూ ఎవరు? నువ్వా నేనా?"
లుల్లాయ్: "నువ్వేలే, నువ్వే చెప్పు."
లుల్లూ: "తరువాత, మన బ్లాగ్స్లో అతణ్ణి తిడుతూ బూతులు రాద్దాం"
లుల్లాయ్: "వాటికి కామెంట్స్ కూడా మనమే..."
లుల్లూ కుర్చీలో నుంచి లేచి, నేల మీద గోడకు ఆనుకుని కూచోని, మోకాళ్ల మీద మోచేతులు, నెత్తి మీద అరచేతులు ఆనించుకుని, "నువ్వే చెప్పరా, నేను చెప్పలేను" అన్నాడు. లుల్లాయ్ అతణ్ణి చెయ్యిపట్టుకుని లేపి, "ఇక మాట్లాడనులే అన్నాయ్, నువ్వే చెప్పు." అన్నాడు.
లుల్లూ: (మళ్లీ కుర్చీలో కూచోని) "మన బ్లాగ్స్లో అతణ్ణి బూతులు తిడుతూ కామెంట్స్ మనమే రాసుకుందాం." అన్నాడు.
లుల్లాయ్: "నీ బ్లాగులో పారడి రాస్.."  .. "సారీ సారీ, నువ్వే చెప్పు."
లుల్లూ: "నా బ్లాగ్లో పారడి రాస్తాను."
కారత్ చలం: "నాకు పారడీలు రావు, కానీ ఎలా రాయాలో తెలుసులే."

అప్పటిదాక మాట్లాడకుండా ఉన్న కారు తిక్కలోడికి ఏమీ అర్థం కాలేదు. అడుగుదామంటే అన్నాయ్ ఏమంటాడో అని భయం. ఎలాగో ధైర్యం తెచ్చుకుని అడిగాడు, "ఇవన్నీ మనకెందుకు అన్నాయ్? ఆయన రాసుకుంటే రాసుకుంటాడు, మనకెందుకు?"
లుల్లాయ్: "డెమాక్రసీ అమ్మా డెమాక్రసీ!"
లుల్లూ: "రేయ్ లుల్లాయ్" అని కోపంగా అరిచి, నోర్ముయ్యమన్నట్టు చూశాడు. ఎంత అరిచినా మాట వినడని లుల్లూకు అర్థం అయింది. వీడిని కంట్రోల్ చెయ్యాలంటే ఒకటే మందు. దాన్ని వాడాడు.. "డెమాక్రసీ అంటే డిఫైన్ చెయ్యరా లుల్లాయ్" అని గద్దించాడు.
లుల్లాయ్: "అన్నా...య్!" అని దీనంగా అరిచాడు. అన్నాయ్ ఇచ్చే డెఫినిషన్ ట్రీట్మెంట్ ఇప్పటికే ఒకసారి అనుభవం అయింది అతడికి. అందుకే భయం వేసింది.
లుల్లూ: "డిఫైన్ చెయ్యమంటే అరుస్తావేంటిరా?"
లుల్లాయ్: "తెలీదన్నా?"
లుల్లూ: "మరి, నీకేదో చాల తెలిసినట్లు డెమాక్రసీ డెమాక్రసీ అని అరుస్తున్నావు ఏంటి?"
లుల్లాయ్: "అర్థం అయిందన్నాయ్, నేను మాట్లాడకూడదు, నువ్వే మాట్లాడాలి."
లుల్లూ: "అదీ అలా ఉండు" అని, మళ్లీ తానే "డెమాక్రసీ అంటే.. నేను నా ఇష్టం వచ్చినట్లు రాసుకుంటాను. నువ్వు కూడా నా ఇష్టం వచ్చినట్లే రాయాలి. సింపుల్గా ఇదీ డెమాక్రసీ అంటే! ఆ ధర్మ మనకు నచ్చనిది రాశాడు, మన పర్మిషన్ లేకుండా రాశాడు. అందుకని మనం పనిష్మెంట్ ఇస్తాం. అండర్స్టుడ్?"
తిక్క: "ఓహో, అర్థం అయిందన్నాయ్. నన్ను ఏమ్ చెయ్యమంటావు అన్నాయ్?"
లుల్లూ రిప్లై ఇచ్చేలోగా కారత్ చలం మాట్లాడాడు. "డెమాక్రసీ అంటే ఏంటంటే.."
లుల్లాయ్: "ఆగాగు, డెఫినిషన్ అన్నాయ్ చెప్పాడు కదా? అయినా ఇలాంటివి మనం చెప్పకూడదు, అన్నాయే చెప్పాలి."
లుల్లూ గర్వంగా మీసం మెలేసినట్టు action చేశాడు.
కారత్ చలం: "ఏడిశావులే, లుల్లూ అంటే నీకు పైనా కిందా దడదడ, నాక్కాదు. నాకు ఎవడైనా ఒకటే. మగాడా కాదా అనేది మాత్రమే చూస్తాను."
లుల్లాయ్: "కాదు కారత్.."
కారత్ చలం: "మూసుకోని చెప్పేది విను.. డెమాక్రసీ అంటే ఆఫ్ ది బూతు, బై ది బూతు, ఫర్ ది బూతు. అంతే."
తిక్క: "భలే భలే. బాగా చెప్పావు కారత్."
లుల్లాయ్: "ష్.. తిక్కలోడా, అన్నాయ్ ముందు వేరేవాళ్లను పొగడకూడదు."
తిక్క: "సారీ సారీ!"
కారత్ చలం: "నేను చెప్పడం అయిపోలేదు, ఇంకా ఉంది.. డెమాక్రసీ అంటే, మన బెడ్రూములో చేసే పనులు, కబుర్లను ఏరోజుకారోజు బ్లాగుల్లో రాయాలి. అందరినీ రాయమని చెప్పాలి. అట్లా మోడ్రన్ తింకింగ్ తో రాయటం అలవాటు చేసుకుని, అందరికీ అలవాటు చెయ్యాలి. మన private affairs కూడా ఈ మోడ్రన్ తింకింగ్ లోకి లాక్కురావాలి. There is no place for decency. చిత్తకార్తె కుక్క మనందరికీ ఆదర్శం కావాలి."

అందరూ: "సరే మనందరం మన బ్లాగులకు వెళ్లి అనుకున్న పనులను చేసేద్దాం, ధర్మను లొంగదీసి మనదారిలోకి తెచ్చుకుందాం, పదండి. జై బ్లాగ్ డెమాక్రసీ!"
కారత్ చలం: "లుల్లూ పద, నేనూ నీ బైకు మీద వస్తాను."
లుల్లూ: "నువ్వు బైకు వేసుకురాలేదా?"
కారత్ చలం: "నీ బైకు మీద వద్దామని ప్లాను వేసి, వచ్చేటప్పుడు ఆటోలో వచ్చాను"

20 comments:

  1. super.
    లుల్లాయ్, తిక్క: "నవ్వం నవ్వం"
    లుల్లూ: "నేను జోకులు వేసినపుడు నవ్వి తీరాలి"
    లుల్లాయ్, తిక్క: "నవ్వుతాం నవ్వుతాం"
    -------
    This is completely true

    ReplyDelete
  2. ఈ డెమోక్రసీ ఏమిటి కొత్తగా? డెమోక్రసీకి, రౌడి, ఒంగోల్ సీనులకు ఏమిటి రిలేషన్?

    ReplyDelete
  3. ఈ సీనుగాడు సాయిని నమ్మితే అందరూ ఓహో అని ఊరుకోవాలట. సాయిని మధ్యలో లాగకూడదట. వాడు మాత్రం శర్మ గారి నమ్మకాలను వెక్కిరిస్తాడు. హిపోక్రెట్!

    ReplyDelete
  4. :))

    పేరడీ బాగానే బావుంది కానీ మన పెళ్ళాలను, పిల్లలనీ తీసివేస్తే ఇంకా బావుండేది. బ్లాగుల్లో సభ్యత అంటూ ఈ బ్లాగుని మొదలుపెట్టిన మీరు కూడా అలా వ్రాయడం బాగాలేదు. ఆ వాక్యాలను తొలగిస్తే సంతోషిస్తాను, తొలగించకపోతే భరిస్తాను.

    ReplyDelete
  5. @Anon: >డెమోక్రసీకి, రౌడి, ఒంగోల్ సీనులకు ఏమిటి రిలేషన్?>> This batch keep boasting that they brought democracy to Telugu blogs. Ongole Srinu is so arrogant that he wrote a post claiming this. And, see what they are doing now. Hypocrites!

    ReplyDelete
  6. @శరత్ 'కాలమ్': Why ధన్యవాదాలు? Just think back, why you felt bad about "మన పెళ్ళాలను, పిల్లలనీ". What made you think it is not సభ్యత? How far your writings confirm to సభ్యత? Do you have the moral ground to talk about the contents of other blogs?

    ReplyDelete
  7. బావుంది.. హ హ హ.. ఈ డెమొక్రసీ డెఫినిషన్ లో ఇంకో విషయం కూడా చేర్చాల్సిందే అని డిమాండ్ చేస్తున్నాను.

    ఎవరేం రాయాలన్నా, ముందు వాళ్ళు అన్ని విషయాలమీదా వాళ్ళ వైఖరి చెప్పాలి వీళ్ళకి. లేకపోతే నక్సలైట్లైన బాకు హేమేష్ మరియూ, కారత్ చలం బావ మొదలైన వాళ్ళ ఏజెంట్ల కిందే పరిగణించబడతారు.

    ReplyDelete
  8. ఔను, ఒంగోల్ రాసిన ఆ పోస్ట్ నేను చూశాను. చూసి, వీడికి ఎంత బలుపు అని అనుకున్నాను. బాగా గడ్డిపెట్టారు ఆ గాంగ్కు.

    ReplyDelete
  9. తెలుగు బ్లాగు ప్రపంచ చరిత్రలో.. లూల్లూ, లుల్లాయ్ అద్భుతమైన పాత్రలుగా నిలిచి పోతాయి. టాం అండ్ జెర్రీ లాగా...:))))) ఇంతకీ లుల్లాయ్ అంటే ఎవరు?

    whoever they are they will be thanking you for crafting a permanent place for them in the blog history :)))))))))))))))))

    ReplyDelete
  10. This comment has been removed by the author.

    ReplyDelete
  11. @Weekend Politician: I looked for the comments of the female that you referred and could not find anything so serious that she can be commented upon here -hence removed your comment.

    ReplyDelete
  12. Well.. by writing about this democracy.. you seem to have learned it as well.. :))))

    Just kidding.. it's OK if you think it is not so serious... btw, using the same logic as her.. who said it is about her :))

    ReplyDelete
  13. సభ్యతా, సంస్కారాలపై సలహాలివ్వడానికి శరత్ ని మీకు అడ్వైసర్ గాపెట్టుకోండి.

    ReplyDelete
  14. హలో
    మీరు ఎవరో గానీ చాలా మంచి పని చేస్తున్నారండీ. నిజంగా ఉద్విగ్న భరితంగా చెప్తున్నాను. ఈ ప్రమాదవనం గాంగ్‌ అందరూ తాలిబాన్‌ టెర్రరిస్టుల మాదిరి తయారయ్యనడీ. నిజంగా చెప్తున్నాను నా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయ్‌.
    ఈ కార్తీక్‌ అనే ఒక దరిద్రుడు అన్వసరంగా ఆడబ్లాగర్లనీ వాళ్ళని ఎవరు సపోర్ట్‌ చేసినా వాళ్ళనీ తగులుకుని చాలా అసభ్య కరమైన పదజాలంతో టపాలు రాస్తున్నాడు, ఎవరిచ్చారండి వాళ్ళకీ హక్కు, ఒంగోలుశీను అనే దరిద్రుడు మళ్ళా తర్వాత మిమ్మల్ని కాదని కవరింగు ఇస్తున్నాడు, వాడి బ్లాగ్‌ చూడండి అక్కడినుంచీ ఇక్కడి నుంచీ ఎత్తుకొచ్చిన సుత్తిని పెట్టి వళ్ళనీ వీళ్ళనీ కించ పరుస్తున్నాడండీ. వీళ్ళు అసలు మనుషులేనా.
    తెలుగు సినిమా పరిశ్రమకి ఆ నలుగురు తెలుగు బ్లాగ్లోకానికి" ఒంగోలుశీను, కార్తీక్‌, మలక్‌, తార" తయారయ్యారు, ఏకలింగం లాంటి వాళ్ళు ఇలాంటివి చూసీ చూడనట్టు చేస్తున్నారు.
    అరేయ్‌ మీరు మనుషులా పశూవులా రా? చీ మీ బతుకులు తగలబెట్ట నాశమైపోతారా. పది మంది కలిసి ప్రమాదవనం అని అడ్డుబెట్టుకుని ఇంకోళ్ళ మీద పడి ఏడ్వడం మగతనం అనుకుంటునారా? చీ మీ బతుకుల కన్నా ఆశరత్‌ నయం చీ దరిద్రుల్లారా, మీ అమ్మ నాన్న సిగ్గుపడాల్రా మిమ్మల్ని చూసి.
    బ్లాగు వీక్షణం గారూ, దయచేసి వీళ్ళని ఇలాగే ఎండగట్టండి మీకు సహకారం మేము చాలా మందిమున్నాం. ఈరోజు వీళ్ళు ఎవరూ కంట్రోల్‌ చేయలేనంతగా ఎదిగిపోయారు. ఒక నలుగు నాతో కలిస్తే ఈ దరిద్రుల బతుకు మీద వళ్ళకే విరక్తి కలిగేంతగా మనమూ హెరాస్‌ చేయచ్చు, దయ్చేసి చేయి చేయి కలప్న్డి, ఈ దరిద్రులని ఎదుర్కొందాం. ప్లీజ్‌ నాతో కలవండి.

    ReplyDelete
  15. లుల్లూ: "సరే, సరే! మిమ్మల్ని ఇవ్వనులే. మరి నామీద ఎవరైనా జోకులు వేసినా నవ్వకుండా ఉంటారా?"
    లుల్లాయ్, తిక్క: "నవ్వం నవ్వం"
    లుల్లూ: "నేను జోకులు వేసినపుడు నవ్వి తీరాలి"
    లుల్లాయ్, తిక్క: "నవ్వుతాం నవ్వుతాం"

    Soooooo nearer to the truth..:)))
    ----------------
    పై అఙాతా,

    తొక్కేం కాదూ, అసలు ID లతో వచ్చి కామెంటితే అప్పుడు చూద్దాం.

    ReplyDelete
  16. పై అనానిమస్ ఎవరోగాని ....నా అభిప్రాయం కూడా అదేనండి. వాళ్ళు మనుషులే కారు. వాళ్ళూ వాళ్ళ శాడిజం. దరిద్రులు. ఈ బ్లాగ్లోకానికి పట్టిన చీడపురుగులు. చీడపురుగులు ఫీల్ అయినా నేనేం చెయ్యలేను. ఇంకో పోలిక నా దగ్గర లేదు.

    ReplyDelete
  17. కారత్ చలం: "లుల్లూ పద, నేనూ నీ బైకు మీద వస్తాను."
    లుల్లూ: "నువ్వు బైకు వేసుకురాలేదా?"
    కారత్ చలం: "నీ బైకు మీద వద్దామని ప్లాను వేసి, వచ్చేటప్పుడు ఆటోలో వచ్చాను" idi maatram keka

    ReplyDelete