Sunday, October 31, 2010

మరొక కొత్త డెఫినిషన్

డెమాక్రసీకి డెఫినిషన్ ఇచ్చాక, ఇప్పుడు కెలుకుడుకు డెఫినిషన్ ఇచ్చింది మన గబ్బు గాంగ్. అయితే సడెన్ గా ఈ డెఫినిషన్ ఎందుకు ఇస్తున్నారు? ఇన్నాళ్లుగా తాము చేసినది డెమాక్రసీలో భాగంగా చెప్పుకుంటు వచ్చారు. ఈ డొల్ల మాటలను బ్లాగర్స్ నమ్మటం లేదు అని తెలిసిపోయింది. కాబట్టి, ఇప్పుడు కెలుకుడు కొత్త డెఫినిషన్ ఇచ్చి క్రెడిబిలిటీ తెచ్చుకోవటానికి ట్రై చేస్తున్నారు. రాసినవారి పేరు కూడా మార్చారు. This character, Nippuravva, used to be active only in kelukudu posts. It generally adds fuel to fire in the comment war. కాని, ఇప్పుడు దాన్ని డైరెక్ట్ గా ఫీల్డ్ లోకి దింపి, ఒక పోస్ట్ రాయించారు.  

కెలుకుడుకు, విమర్శకూ డిఫరెన్స్ తెలియలేదు గబ్బుగాంగ్ మెంబర్స్ కు. నిన్న మొన్నటి వరకు  కెలుకుళ్ల మురుకుళ్లలో పొర్లీ పొర్లీ తామేం చేస్తున్నారో మర్చిపొయ్యారు. తాము బురదలో పడి దొర్లుతున్నామని ఈ లుల్లు లుల్లాయిలకు, ఎల్లాయి పుల్లాయిలకు మనం గుర్తు చెయ్యాల్సి వచ్చింది. అది గుర్తు చేశాక,  వాళ్ల తప్పులను ఎత్తిచూపాక, ఇప్పుడు కొత్త రాగం ఎత్తుకున్నారు. బ్లాగర్స్ అందరూ చేసున్నది కెలుకుడేనట. :-)

మనకు ఒకటి తెలుస్తున్నది. తాము బురదలో నుంచి బయటికి రావాలని అనుకోవటం లేదు. "మేమున్నది బురదే, మీరున్నది కూడా బురదే. అందుచేత మీరు బాధ పడనక్కరలేదు. అందరం అందులోనే ఉన్నాము కాబట్టి, ఊరికే బాధపడకండి" అంటు మనకు నచ్చచెబుతున్నారు. వీళ్లకున్న రోగమే ఇతరులకు కూడా ఉందని చెప్పుతున్నారు. తాము చేసిన పనులు తప్పేమీ కాదు, అందరు చేస్తున్నది అదేనని చెప్పుకుంటూ తమ తప్పులను కప్పేసుకోవాలని చూస్తున్నారు.

ఇప్పుడు తమ తప్పుడు పనులు బైటపడుతు ఉండేసరికి, తమ చాటుమాటు పనులు బట్టబయలు అయ్యేసరికి ముఖాలు కప్పుకోవటానికి మూరెడు బట్ట కూడా కనబడకపోయేసరికి కెలుకుడు అంటే మరేంటో కాదు, మనందరం చేస్తున్నదేనంటూ దొంగ మాటలు చెబుతున్నారు.

శర్మగారిని బజారుకు ఈడ్చి, రచ్చరచ్చ చేసారే, అది అందరూ చేస్తున్నారా? అది ఏపీమీడియా రామూ  గారు చేశారా?  అబ్రకదబ్ర  గారు చేశారా? వీవెన్ గారు చేశారా? బ్లాగాడిస్తా రవి గారు చేశారా? తాడేపల్లి గారు చేశారా? చాకిరేవు గారు చేశారా?  తన మానాన తానేదో రాసుకుంటూ ఉండే శర్మగారిని  పట్టుకుని బూతులు తిట్టారా వీళ్లు? లేదే!!

ఈ కెలుకుడు గుంపు లాగా మిగతా బ్లాగర్ల్స్ కూడా అజ్ఞాతల లాగ, ఫేక్ యూసర్ల లాగ కామెంట్స్ రాశారా? తోటి బ్లాగర్స్ ను బూతులు తిట్టారా?

ధూమ్, కాగడా లాంటి వాళ్లు ఛండాలమైన బూతులు రాస్తున్నపుడు, చప్పట్లు కొట్టి ఎంజాయ్ చేసింది, ఎంకరేజ్ చేసింది మిగతా బ్లాగర్లా? వీళ్లు కాదూ! ఒంగోలు సీనే చెప్పాడు, ఎంకరేజ్ చేశామని.

ఇప్పుడు ఈ కెలుకుడు వీరులు అందరు కలిసి, "కెలుకుడు అందరం చేస్తున్నాము, బాధపడకూడదు" అంటు సన్నాయినొక్కులు నొక్కుతున్నారు."కెలుకుడును బ్లాగ్జీవితంలో ఒక భాగం"గా ఫీలవ్వాలట! :-) అవినీతి చేశానని నన్ను అంటావేమిటి, నువ్వు చేసింది కూడా అవినీతే కదా అని పొలిటీషియన్స్ అన్నట్లుగా ఉంది వీళ్ల వాదన.

ఎందుకు వీళ్లు ఇలా తమ \తప్పుడు పనులను కవర్ చేసుకోవటానికి చూస్తున్నారు? బ్లాగర్స్ కు తమ కెలుకుడు నచ్చటం లేదని తెలిసిపోయినప్పుడు దాన్ని ఆపకుండ, "అందరూ చేస్తున్నార"ని సమర్ధించుకోవటం ఎందుకు? ఎందుకు ఇలా తమ హేట్రెడ్ కు క్రెడిబిలిటీ తెచ్చుకోవాలని చూస్తున్నారు? బండబూతులు తిట్టటానికి, విమర్శకి తేడా ఏమీ లేనట్లు మాట్లాడుతు ఉన్నారు ఎందుకు? ఎప్పుడు వదిలిపెడతారు ఈ హిపోక్రసీని?

Sunday, October 24, 2010

Their Anon games - An example

గబ్బు గాంగు వాళ్లు రెండు నాలుకలవాళ్లు అని, Anon games ఆడుతు ఉంటారని నేను చెబుతు ఉన్నాను. కాదు కాదని వాళ్లు అంటు ఉన్నారు.

"I told you we are what we are and do what we do! We do everything in hte open and it's you guys who are scared" అని తన బ్లాగ్ లో రాశాడు గబ్బర్. ఇందులో రెండు నిజాలు, ఒక అబద్ధము ఉన్నాయి.

నిజం 1: "I told you we are what we are and do what we do! " నేను కూడ అదే చెబుతున్నను, వీళ్లు ఏది అనుకుంటారో అది చేసి తీరుతారు. ఎవరు ఏమి అన్నా, వీళ్లకు నచ్చని టాపిక్స్ పై రాసే బ్లాగర్స్ ని హింస పెట్టడం వీళ్లు మానరు.

నిజం 2: "..and it's you guys who are scared" - ఇది కూడ నిజమే. ఈ గాంగ్ హెరాస్మెంట్ కు భయపడే ఇలా అజ్ఞాతంగా రాస్తున్నది. స్వంత పేర్లతో రాస్తే, మీరు మామీద (కుటుంబ సభ్యులను కూడ వదలకుండా)  ఏ విధమైన బార్బేరియస్ దాడి చేస్తారో మాకు తెలుసు. గతంలో ఎన్నో అకేషన్స్ లో చూశాము కదా!

అబద్ధం 1: "We do everything in hte open " - ఇది పచ్చి అబద్ధం. వీళ్లది ఎంత గబ్బు behavior అంటే, వీళ్ల ఓన్ ఐ.డి లతో కామెంట్స్ రాస్తు ఒక ప్రక్క డిస్కషన్ చేస్తూనే, మరో ప్రక్క, Anon comments రాసి అదే మనిషిని బూతులు తిడతారు. ఎన్ని బ్రౌజర్స్ వాడుతారో కాని, నిముషాల్లో వందల కామెంట్స్ రాస్తారు. నా బ్లాగ్ మూడవ పోస్ట్ లో గబ్బర్ అరగంటలో అరవై కామెంట్స్ రాసి స్పామ్ చేశాడు. చచ్చి చెడి వాటిని డిలీట్ చేశాను. :-)

మల్టిపుల్ బ్రౌజర్ విండోలను ఓపెన్ చేసిపెట్టి, ఒకచోట ఒరిజినల్ ఐ.డి తోటి, మరొక చోట Anonymous గా రాస్తు ఉంటారనుకుంటాను. శాంపిలుగా ఒకటి ఇస్తాను చూడండి.

http://ongoluseenu.blogspot.com/2010/06/blog-post_11.html  పోస్ట్ లో కామెంట్స్ చూడండి. June 14, 2010 నాడు ఒంగోలుకు, పిల్లకాకి (కృష్ణ) కి జరిగిన డిస్కషన్ లో-

3:25 PM: కృష్ణ ఒంగోలును ఒక ప్రశ్న అడిగాడు.
3:43 PM: ఒక Anon రిప్లై ఇచ్చాడు. కాని కంప్లీట్ గా ఇవ్వలేదు.
3:44 PM: Anon ఇచ్చిన రిప్లైని కంటిన్యూ చేస్తు ఒంగోలు కామెంట్ రాశాడు.
కొన్ని కామెంట్స్ తరువాత 3:49 కి రాసిన కామెంట్ లో "నా పై కామెంట్ అనానిమస్ గా ఎందుకు వచ్చిందో నాకు తెలీదు." అని అమాయకత్వం నటించాడు.

ఇదిగో ఈ ఇమేజెస్ చూడండి.




రెండు నాలుకలు:  ఒక నాలుక తిడుతుంది, రెండో నాలుక మామూలుగా మాట్లాడుతుంది. తిట్టే నాలుకకు పేరు ఉండదు -Anonymous, లేదా ఏదో ఒక ఫేక్ యూజర్నేమ్ ఉంటుంది. స్వంత పేరుతో ఉన్న నాలుక జనరల్గా పద్ధతిగా మాట్లాడుతుంది. ఇది వాళ్ల మోడస్ ఆపరాండి. అయితే, ఈ ఎక్జాంపుల్లో చిన్న డిఫరెన్స్ ఉంది. శ్రీనివాస్ చేత రాయించవలసిన కామెంట్ ను పొరపాటున Anon తో రాయించాడు. :-) తరువాత సర్దుకుని వెనువెంటనే తన ఒరిజినల్ ఐ.డి.తో రాశాడు. తను చేసే అజ్ఞాత కార్యాలు బయటపడతాయేమోనని, సర్దుకోటానికి ట్రై చేశాడు.

ఇలాంటివి ఆ కెలుకుడు మురుగులో ఎన్నో ఎన్నెన్నో.

Friday, October 22, 2010

మళ్లీ రుజువయింది

గబ్బు, గాంగ్ సభ్యులూ!

కెలికినన్ని రోజులు కెలికారు. కెలికి కెలికి బ్లాగ్ లను మురికి మురికి చేశారు. దారినపోయే ప్రతి దానయ్యను కెలుకుతుంటారు. ఎప్పుడో శర్మ గారిలాంటి వాళ్లు తగులుతారు, మీ తలపొగరు అణుస్తారు. మీ రాతల్ని రెగ్యులర్గా చదివే అందరికి తెలుసు, అజ్నాతలు మీరేనని, నిప్పులు, రవ్వలు మీరేనని, ముసుగులు మీరేనని, మురుగులు మీరేనని.

అయితే ఏంటి అని అంటారా? ఏముంది, మీరేంటో తెలిశాక, ఇకపై రాసే ఏ అనామక రాత ఎవరిదో, ఏ దొంగ రాతలు ఎవరు రాస్తున్నారో, చాలవరకు గ్రహించగలం.
-------------------------------------------------

వీళ్ల పోస్ట్లు చూడండి
పోస్ట్ మామూలూగా ఉంటే కామెంట్స్ కూడా సాదాగా, కూల్ గా ఉంటాయి. ఎవరిపైనైనా దాడి చేసినపుడు మాత్రం అనామక కామెంట్స్ లేదా shady users రాసే కామెంట్స్ పదులు, వందల్లో వచ్చేస్తాయి. వీళ్లు కెలుకుతున్న పోస్ట్ లకు మాత్రమే ఇలా అనామక కామెంట్స్ ఎక్కువగా వస్తాయి. మరెక్కడా అన్ని రావు.

శర్మ గారితో గబ్బు గాంగ్ గొడవ లొ కూడ అదే జరుగుతున్నది. శర్మ గారు రాసింది నాకు కూడ నచ్చలేదు. నచ్చనివాళ్లు చాలామంది ఉంటారు. కానీ వాళ్లు వాళ్ల బ్లాగుల్లో పోస్ట్స్ రాసి అతడిని తిట్టలేదు. నచ్చకపోతే ఆ సంగతి రాయవచ్చు. కానీ తిట్టటం ఎందుకు? చేసిన దంతా చేసి, మళ్లి డెమాక్రసీ అని హిపోక్రసీ వెలగబెడుతున్నారు. లుల్లూ చెప్పిన ఒక మాట - "Sarma garu wrote his post in a democratic way and Sreenu responded democratically too." LOOOLZ కదా! :-) ఇలాంటి జోకులు వేసి నవ్విస్తాడనే అతడికి లుల్లూ అని పేరు వచ్చింది.

సీను డెమాక్రటిక్ గా బూతులు తిట్టాడట. :-) శర్మ గారు కూడ డెమాక్రటిక్ గానే చావగొట్టారు. గబ్బరుసింగ్ అంటు ఉంటాడు నువ్వు ఒక చెంపన కొడితే మేము ఆ చెంపా ఈ చెంపా ఎడాపెడా వాయించేస్తాము అని. ఇప్పుడు శర్మ గారు చేసింది కూడా అదే- అందర్నీ కెలికినట్టే అతడినీ కెలకాలని చూశారు. అతడు వీళ్ల చెంపలు ఛెళ్ ఛెళ్ మనిపించటమే కాదు, చెవులు పిండి, తొడపాశం కూడా పెట్టారు.

"మేము నమ్ముతున్న దేవుడిని తిట్టాడు" అని అంటున్నది గబ్బు గాంగ్. మరి శర్మ గారు నమ్ముతున్న తంత్ర విద్యలను తిడితే ఆయనకు కోపం రాదా? మర్చిపోయాను, డెమాక్రసీ కదా! డెమాక్రసీలో కోపం గాంగ్ కే రావాలి కాని, మనకెవ్వరికీ రాకూడదు.

హైలైట్ ఏమిటి అంటే, విట్రియల్ "Define democracy!" అని లుల్లూను అడగటం. :-)

విట్రియల్ గారు, మీకు అక్కడ సమాధానం ఇవ్వటానికి గబ్బర్ సింగ్ సిగ్గుపడ్డాడు. నేను చెప్తాను: డెమాక్రసీ ఈస్ ఆఫ్ ది గబ్బు గాంగ్, బై ది గబ్బు గాంగ్, ఫర్ ది గబ్బు గాంగ్!

Wednesday, October 20, 2010

అసలే కోతులు

అసలే కోతులు
+ గుడ్డివి
+ పిచ్చెక్కింది
+ కల్లు తాగాయి
+ నిప్పుతొక్కాయి

ఇక అవి చేసే గోల ఎలా ఉంటుంది? మన గబ్బు గాంగ్ చేసే గత్తరలాగా ఉంటుంది.

గబ్బు గాంగ్ సంగతి ఏమిటి?

అది  అసలే గబ్బు గాంగ్
+ వాళ్లకు లుల్లూ లుల్లాయిలనే పేర్లు పెట్టారు
+ గబ్బు సింగులనే పేర్లు పెట్టారు
+ వాళ్ల రౌడీయిజాన్ని బ్లాగర్స్ ఎదిరించారు
+ anonymous లు, దొంగపేర్లతో వాళ్లు చేసే మాయలు, రాసే కామెంట్స్ గురించి బ్లాగర్స్ కు తెలుస్తున్నది.
+ బ్లాగ్ డెమాక్రసి అంటు వాళ్లు చేసిన డొల్ల వాదనలు బైటపడ్డాయి. ఎవరో ఒక బ్లాగర్ తన బ్లాగ్ లో ఏదో రాసుకుంటే ఆయనకి అటాకిచ్చి, అసభ్యంగా తిట్టారు.
+ కత్తి, ప్రవీణ్ లను ఎదిరిస్తున్నాం అనే వంకన బ్లాగర్లపై వాళ్లు చేస్తున్న దాడి దౌర్జన్యం బైటపడుతోంది. (అందువలననే తాము రాసిన పోస్ట్ లను తీసివేశారు.)

ఇన్ని ఎదురు దెబ్బలు తిన్నాక, ఇప్పుడు వీళ్లు చేసే గోల ఎలా ఉంటుంది?

అదుగో ఆ పైన చెప్పిన కల్లుతాగి, నిప్పు తొక్కిన, పిచ్చి, గుడ్డి, కోతుల గోల మాదిరిగా ఉంటుంది. అలాగే ఉంది.

ఇంకొక కామెంట్లాట

ఈ మలక్ గాంగ్ మరొక ఆట మొదలు పెట్టారు. అప్పల్రాజు బ్లాగులో జరుగుతున్న కామెంట్ల్స్ తమాషా చూడండి.. అజ్నాతల పేరుతో కామెంట్లు కుమ్ముతున్నారు. లుల్లూ, లుల్లాయిలు ఈ ఆటలో ముదుర్లు. వాళ్ల బ్లాగ్ అయినా, వేరే బ్లాగ్ అయినా కామెంట్స్ ఆట మాత్రం వాళ్లదే. ఒక కామెంట్లో తమని తిట్టుకుంటారు. నెక్స్ట్  కామెంట్లో తమని పొగుడుకుంటారు. అప్పల్రాజు బ్లాగ్లో కామెంట్స్ పెడుతున్న Anonymous లు చాలావరకు ఆ గాంగ్ లోని కేటుగాళ్లే. మహా మాయగాళ్లు. అలా రీడర్స్ ను  confuse చేస్తారు.

మాలికను తిడుతూ రాస్తున్న కామెంట్స్ ఈ కేటుగాళ్లు రాస్తున్నవే. మాలిక మీద ఉన్న అసూయ కారణంగా ఇలా బ్లాగ్ రాస్తున్నాడు అనే పిక్చర్ ఇవ్వటం దానివెనక వాళ్ల  ఉద్దేశ్యం. Devious bunch of cons.

This dirty gang of 'democracy torchbearers' has now become synonymous for "Anonymous"

Tuesday, October 19, 2010

గబ్బు సింగ్ - గబ్బర్ సింగ్ - గబ్బెస్ట్ సింగ్

లుల్లూ గాంగ్ను అసహ్యించుకునేవాళ్లు ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నారు. లుల్లూ లుల్లాయిల అసలు స్వరూపాలను బయటపెడుతున్నారు. ఈ టైములో అందరి ఎంటర్టైన్మెంట్ కోసం మరొక సెట్ పేర్లు ఇక్కడ ఇస్తున్నాను. 

కిందటి పోస్ట్లో చెప్పినట్లు these are the pseudonyms of the pseudonyms of the pseudo democracy-torchbearers, living in Telugu blogs.

ఈ పేర్లకు మూలం ప్రవీణ్ శర్మ పెట్టిన విడియో. అతడు ఈ లుల్లూ లుల్లాయ్ల మీద ఒక వీడియో పెట్టాడు. అందులో లుల్లూను గబ్బర్ గా, లుల్లాయిని, కారుతిక్కలోడిని అతడి అసిస్టెంట్స్ గా చూపించాడు. 

అసలు గబ్బర్ అంటే ఏంటో తెలుసా?  గబ్బు - గబ్బర్ - గబ్బెస్ట్ లలో రెండోది గబ్బర్. 

గబ్బరంటే మలక్కు, మరి మిగతా రెండు? నా ఒపీనియన్లో 
గబ్బు సింగ్ - కారు తిక్కలోడు (కార్తిక్)
గబ్బర్ సింగ్ - లుల్లూ alias మలక్
గబ్బెస్ట్ సింగ్ - లుల్లాయ్ alias ఒంగోలు సీను alias ఒంగోలు దున్న

ఈమధ్య వీళ్లు రాసిన నీచమైన పోస్ట్లు, కామెంట్స్ చూశాక, ఈ పేర్లు వీళ్లకు సరిగ్గా సరిపోతాయి అనిపించింది.

గబ్బెస్ట్ సింగ్ లుల్లాయికి బాగలేదు, లుల్లూకే ఇవ్వాలనుకుంటె మీ ఇష్టం. 

Monday, October 18, 2010

లుల్లూ, లుల్లాయ్ ఎవరనగా...

లుల్లూ, లుల్లాయ్ అంటే ఎవరని కొందరు అడిగారు. అది చెప్పటానికే ఈ పోస్ట్. ఒకే సెంటెన్స్ లో చెప్పాలంటే,
these are two of the pseudonyms of two of the pseudonyms of two of the pseudo democracy-torchbearers, living in Telugu blogs.

మలక్ పేట్ రౌడీ అని ఒక బ్లాగర్ ఉన్నాడు. lol lool loooool lolz, loolz, looooolz - ఇవి అతడికి ఊతపదాలు. ఒక రౌడిగాంగ్ ను గాదర్ చేసి రౌడిఇసమ్ చేస్తు ఉంటాడు. ఎవరైన ఈ ఊతపదాలను వాడితే అది నాది నా ట్రేడ్మార్క్ అని అంటాడు. అందువలన అదే ఇతడి పేరైతే సూట్ అవుతుందని అనుకున్నాను. అలా లోలూ, లూలూ వెలుగులోకి వచ్చాయి. ఇంకో రకంగా చెప్పాలంటే ఈ పేరులోని మొదటి లూ ఫస్ట్ నేమ్ గాను, రెండో లూ ను  లాస్ట్ నేమ్ గానూ అనుకోవచ్చు. లూ (loo) అంటే ఏమిటి అని డెఫినిషన్ అడగ వద్దు, google it. ఆ లూలూయే గ్రాడ్యువల్గా లుల్లూ అయింది.



లుల్లాయ్ గురించి. లుల్లూకి ఒంగోలు సీను అనే ఒక అసిస్టెంట్ ఉన్నాడు. అతడు తనని తాను ఒంగోలు దున్న అని పిలుచుకుంటు ఉంటాడు. అందుచేత అతడికి లుల్లాయ్ అని పేరు పెట్టాను. ఎందుకంటే, లుల్లాయము అంటే దున్నపోతు అని అర్థం ఉందట. లుల్లూకి దగ్గరగా ఉంది కదా, అది కూడ ఒక రీసన్.

వీళ్లు ఇద్దరు కలిసి బ్లాగుల్లో డెమాక్రసి తెచ్చామని చెప్పుకుంటు ఉంటారు. వీళ్ల నేతిబీరకాయ డెమాక్రసిలో నెయ్యి ఎంత ఉందో ఒంగోలు సీను రాసిన పోస్ట్లో చూడవచ్చు. దాని మీద నేను రాసిన పోస్త్ కూడ (ప్రీవియస్ పోస్ట్) చూడండి.

Saturday, October 16, 2010

ఆఫ్ లుల్లూ బై లుల్లూ ఫర్ లుల్లూ!

బ్లాగ్ డెమాక్రసీ పరిరక్షణ సమితి సమావేశం జరుగుతుంది అక్కడ. సమితి ప్రెసిడెంట్ లుల్లూ, క్లర్క్స్ లుల్లాయ్, కారుతిక్క ఉన్నారు అక్కడ. వాళ్లతోపాటు కారత్ చలం కూడ ఉన్నాడు. అతడు ఈ సమితిలో మెంబర్ కాదు. కానీ ఎక్కువగా అక్కడికి వస్తు ఉంటాడు. అతడు కామెడీ కబుర్లు చెబుతాడు కాబట్టి, కాస్త ఎంటర్టైనింగ్గా ఉంటుందని వాళ్లు అతణ్ణి పిలుస్తారు. అక్కడికి వెళ్తే తనకు అవసరమైన ఎంటర్టైన్మెంట్ తనకు దొరకక పోతుందా అనే ఆశ అతడికి.

లుల్లూ: "కారత్, నీ అసిస్టెంట్లు ఎవరూ రాలేదా?"
కారత్ చలం: "అసిస్టెంట్లా? ఎందుకు?"
లుల్లూ: "అదేంటి, మనలాంటి బ్లాగ్ బాస్ లకు అసిస్టెంట్లు లేకపోతే ఎట్లా? నాకు చూడు ఇద్దరు ఉన్నారు."
కారత్ చలం: "నాదగ్గర అసిస్టెంట్లుగా ఉండటానికి ఎవరూ ఇష్టపడటం లేదు లుల్లూ. ఎందుకో అర్థం అవటం లేదు."
నాకు తెలుసులే అని లుల్లూ మనసులో అనుకున్నాడు.
కారత్ చలం: "అయినా అసిస్టెంట్లను పెట్టుకుంటే మనీ వేస్టు కదా?"
లుల్లూ: "మనీ ఎందుకు? రోజుకు నాలుగో అయిదో హాఫ్ చాయ్ లు, వీక్లీ వన్స్ బిరియానీ. ఈమాత్రం కూడా పెట్టలేవా?"
కారత్ చలం: "అంతేనా? ఇంత చీపా!! లుల్లూ, నాకు కూడా ఒకళిద్దరు అసిస్టెంట్లను చూసి పెట్టవా?"
లుల్లూ లుల్లాయ్, కారు తిక్కలవంక చూశాడు. వెంటనే వాళ్లు ఇద్దరు లుల్లూ వెనక్కి పోయి దాక్కుని "ఒద్దొద్దు అన్నాయ్" అని కోరస్గా అరిచారు.
లుల్లూ: "సరే, సరే! మిమ్మల్ని ఇవ్వనులే. మరి నామీద ఎవరైనా జోకులు వేసినా నవ్వకుండా ఉంటారా?"
లుల్లాయ్, తిక్క: "నవ్వం నవ్వం"
లుల్లూ: "నేను జోకులు వేసినపుడు నవ్వి తీరాలి"
లుల్లాయ్, తిక్క: "నవ్వుతాం నవ్వుతాం"
కారత్ చలం లుల్లూను ఎడ్మైరింగ్గా చూస్తు ఉండగా, లుల్లూ అన్నాడు "ఇప్పుడు చెప్పు కారత్, ఎందుకు కలుద్దామని అన్నావ్?"

అసలు వీళ్ల మీటింగు ఎందుకంటే, ధర్మ అనే ఒక పెద్దాయన తన బ్లాగుల్లో ఇండియన్ ట్రెడిషనల్ సైన్సెస్ గురించి రాస్తున్నాడు. అతడు బ్లాగ్ డెమాక్రసీ పరిరక్షణ సమితి పర్మిషన్ తీసుకోలేదు. అది సమితికి నచ్చలేదు. దాన్ని అలాగే వదిలేస్తే బ్లాగుల్లో డెమాక్రసీ దెబ్బతినిపోతుందని వీళ్లు భయపడిపోయి, ఆ ప్రమాదాన్ని అడ్డుకోవాలని అనుకున్నారు. కారత్ చలంది డిఫరెంట్ ఐడియాలజీ! బ్లాగుల్లో బండబూతులు రాసుకోవాలి గానీ, ఇండియన్ సైన్సెస్ గురించి రాస్తే తప్పు కదా! అందుకని అతడు ఈ మీటింగ్ ప్రపోజల్ పెట్టాడు.

కారత్ చలం: "లుల్లూ, ఆ ధర్మ బ్లాగును ఎలాగైనా ఆపాలి. ఏంచేద్దాం?"
లుల్లాయ్: "వాడి బ్లాగులో బూతులు రాద్.."
లుల్లూ తనకేసి కోపంగా చూడటంతో సగంలో ఆపేశాడు. ఏం మాట్లాడినా లుల్లూయే మాట్లాడాలి, ఏదైనా చెయ్యాలంటే క్లర్కులు చెయ్యాలి. డెమాక్రసీ కదా! లుల్లాయ్ నోటి దురద కొద్దీ వాగుతుంటాడు. లుల్లూ అలుగుతు ఉంటాడు.
లుల్లూ: "ముందు అతడి బ్లాగులో ఇదేం బాగోలేదని రాద్దాం."
లుల్లాయ్: "అది చాలదు అన్నాయ్. మన బ్లాగుల్లో బూతులు రాయాల్సిందే.."
లుల్లూ: "రేయ్ లుల్లాయ్, లుల్లూ ఎవరు? నువ్వా నేనా?"
లుల్లాయ్: "నువ్వేలే, నువ్వే చెప్పు."
లుల్లూ: "తరువాత, మన బ్లాగ్స్లో అతణ్ణి తిడుతూ బూతులు రాద్దాం"
లుల్లాయ్: "వాటికి కామెంట్స్ కూడా మనమే..."
లుల్లూ కుర్చీలో నుంచి లేచి, నేల మీద గోడకు ఆనుకుని కూచోని, మోకాళ్ల మీద మోచేతులు, నెత్తి మీద అరచేతులు ఆనించుకుని, "నువ్వే చెప్పరా, నేను చెప్పలేను" అన్నాడు. లుల్లాయ్ అతణ్ణి చెయ్యిపట్టుకుని లేపి, "ఇక మాట్లాడనులే అన్నాయ్, నువ్వే చెప్పు." అన్నాడు.
లుల్లూ: (మళ్లీ కుర్చీలో కూచోని) "మన బ్లాగ్స్లో అతణ్ణి బూతులు తిడుతూ కామెంట్స్ మనమే రాసుకుందాం." అన్నాడు.
లుల్లాయ్: "నీ బ్లాగులో పారడి రాస్.."  .. "సారీ సారీ, నువ్వే చెప్పు."
లుల్లూ: "నా బ్లాగ్లో పారడి రాస్తాను."
కారత్ చలం: "నాకు పారడీలు రావు, కానీ ఎలా రాయాలో తెలుసులే."

అప్పటిదాక మాట్లాడకుండా ఉన్న కారు తిక్కలోడికి ఏమీ అర్థం కాలేదు. అడుగుదామంటే అన్నాయ్ ఏమంటాడో అని భయం. ఎలాగో ధైర్యం తెచ్చుకుని అడిగాడు, "ఇవన్నీ మనకెందుకు అన్నాయ్? ఆయన రాసుకుంటే రాసుకుంటాడు, మనకెందుకు?"
లుల్లాయ్: "డెమాక్రసీ అమ్మా డెమాక్రసీ!"
లుల్లూ: "రేయ్ లుల్లాయ్" అని కోపంగా అరిచి, నోర్ముయ్యమన్నట్టు చూశాడు. ఎంత అరిచినా మాట వినడని లుల్లూకు అర్థం అయింది. వీడిని కంట్రోల్ చెయ్యాలంటే ఒకటే మందు. దాన్ని వాడాడు.. "డెమాక్రసీ అంటే డిఫైన్ చెయ్యరా లుల్లాయ్" అని గద్దించాడు.
లుల్లాయ్: "అన్నా...య్!" అని దీనంగా అరిచాడు. అన్నాయ్ ఇచ్చే డెఫినిషన్ ట్రీట్మెంట్ ఇప్పటికే ఒకసారి అనుభవం అయింది అతడికి. అందుకే భయం వేసింది.
లుల్లూ: "డిఫైన్ చెయ్యమంటే అరుస్తావేంటిరా?"
లుల్లాయ్: "తెలీదన్నా?"
లుల్లూ: "మరి, నీకేదో చాల తెలిసినట్లు డెమాక్రసీ డెమాక్రసీ అని అరుస్తున్నావు ఏంటి?"
లుల్లాయ్: "అర్థం అయిందన్నాయ్, నేను మాట్లాడకూడదు, నువ్వే మాట్లాడాలి."
లుల్లూ: "అదీ అలా ఉండు" అని, మళ్లీ తానే "డెమాక్రసీ అంటే.. నేను నా ఇష్టం వచ్చినట్లు రాసుకుంటాను. నువ్వు కూడా నా ఇష్టం వచ్చినట్లే రాయాలి. సింపుల్గా ఇదీ డెమాక్రసీ అంటే! ఆ ధర్మ మనకు నచ్చనిది రాశాడు, మన పర్మిషన్ లేకుండా రాశాడు. అందుకని మనం పనిష్మెంట్ ఇస్తాం. అండర్స్టుడ్?"
తిక్క: "ఓహో, అర్థం అయిందన్నాయ్. నన్ను ఏమ్ చెయ్యమంటావు అన్నాయ్?"
లుల్లూ రిప్లై ఇచ్చేలోగా కారత్ చలం మాట్లాడాడు. "డెమాక్రసీ అంటే ఏంటంటే.."
లుల్లాయ్: "ఆగాగు, డెఫినిషన్ అన్నాయ్ చెప్పాడు కదా? అయినా ఇలాంటివి మనం చెప్పకూడదు, అన్నాయే చెప్పాలి."
లుల్లూ గర్వంగా మీసం మెలేసినట్టు action చేశాడు.
కారత్ చలం: "ఏడిశావులే, లుల్లూ అంటే నీకు పైనా కిందా దడదడ, నాక్కాదు. నాకు ఎవడైనా ఒకటే. మగాడా కాదా అనేది మాత్రమే చూస్తాను."
లుల్లాయ్: "కాదు కారత్.."
కారత్ చలం: "మూసుకోని చెప్పేది విను.. డెమాక్రసీ అంటే ఆఫ్ ది బూతు, బై ది బూతు, ఫర్ ది బూతు. అంతే."
తిక్క: "భలే భలే. బాగా చెప్పావు కారత్."
లుల్లాయ్: "ష్.. తిక్కలోడా, అన్నాయ్ ముందు వేరేవాళ్లను పొగడకూడదు."
తిక్క: "సారీ సారీ!"
కారత్ చలం: "నేను చెప్పడం అయిపోలేదు, ఇంకా ఉంది.. డెమాక్రసీ అంటే, మన బెడ్రూములో చేసే పనులు, కబుర్లను ఏరోజుకారోజు బ్లాగుల్లో రాయాలి. అందరినీ రాయమని చెప్పాలి. అట్లా మోడ్రన్ తింకింగ్ తో రాయటం అలవాటు చేసుకుని, అందరికీ అలవాటు చెయ్యాలి. మన private affairs కూడా ఈ మోడ్రన్ తింకింగ్ లోకి లాక్కురావాలి. There is no place for decency. చిత్తకార్తె కుక్క మనందరికీ ఆదర్శం కావాలి."

అందరూ: "సరే మనందరం మన బ్లాగులకు వెళ్లి అనుకున్న పనులను చేసేద్దాం, ధర్మను లొంగదీసి మనదారిలోకి తెచ్చుకుందాం, పదండి. జై బ్లాగ్ డెమాక్రసీ!"
కారత్ చలం: "లుల్లూ పద, నేనూ నీ బైకు మీద వస్తాను."
లుల్లూ: "నువ్వు బైకు వేసుకురాలేదా?"
కారత్ చలం: "నీ బైకు మీద వద్దామని ప్లాను వేసి, వచ్చేటప్పుడు ఆటోలో వచ్చాను"