Thursday, November 4, 2010

భూతాలవనంలో నీతుల నూతులు

ప్రమాదవనంలో నీతుల నూతుల్లో నీతులు ఊరి ఊరి, బ్లాగులను ముంచేస్తున్నాయి. పారా హుషార్!

బ్లాగర్స్ ఎవ్వరికి ఇప్పటి వరకు తెలియని కొత్త సంగతి ఒకటి ప్రమాదవనంలో రాశారు. Quite useful information, it is! 

వాళ్లు రాసిన రత్నాల్లాంటి మాటలు కింద రాస్తున్నాను. జాగ్రత్తండి, మరీ బరువైన మాటలు, కొంచం ’ఆచి తూచి’ చదవండి. Words, worth their weight in steel! :-) 

"అందరు తమ స్వంత పేర్లతొ వచ్చి ప్రమాదవనం లొ కామెంట్లు పెడతారు కానీ అక్కడ సపొర్ట్ గా  ఒక అనామిక కామెంట్ అయినా రాయడానికి ఇస్టపడరు.."  

పై సెంటెన్స్ లో  "అక్కడ" అంటే ఇప్పుడు మీరు చదువుతున్న బ్లాగు వీక్షణం అండి. "స్వంత పేరు" డెఫినిషన్ మీకు తెలిస్తే మీరు ఇక చదవనక్కరలేదు. తెలియకపోతే చదవండి, తెలుసుకోవచ్చు.

ప్రమాదవనంలో రాసిన ఈ పోస్ట్ (http://pramaadavanam.blogspot.com/2010/11/blog-post.html) కి వచ్చిన కామెంట్స్ ఏమిటో చూసి ఒక చిన్న లెక్క వేద్దాం. 

మొత్తం కామెంట్స్: 79 
అందులో అజ్ఞాతలు రాసినవి: 40 :-)  అందరూ "స్వంత పేర్ల"తో వచ్చి ప్రమాదవనంలో కామెంట్స్ పెడతారని చెప్పారు కదా అని నవ్వకండి. వాళ్లందరిదీ ఒకటే "స్వంత పేరు" - అజ్ఞాత! ఇంటిపేరు Anonymous! :-)

సరే, మిగతా "స్వంత పేర్ల" కామెంట్స్ ఏవో చూద్దామా:

ఒంగోలు సీను రాసినవి: 8 
మలక్ రాసినవి: 16 
కార్తిక్ రాసినవి: 3 
మొత్తం: 27. వీళ్లండి, స్వంత పేర్లతో కామెంట్స్ రాసిన వీరులు! ఈ ముగ్గురు వీరులు ఎవరో మనకు తెలుసు. త్రీ మస్కటీర్స్, త్రీ ఇడి_ _!  :-) 

ఆగండి ఆగండి, ఇంకా ఇద్దరు ధైర్యవంతులు ఉన్నారండోయి.

ఒకరు నీటిబొట్టు గారు: 6
ఇంకొకరు Petrified pork eater గారు: 3

ఈ పేర్లు ఎక్కడా వినలేదే అనుకుంటున్నారా? అంతే అంతే, ప్రమాదవనంలో మాత్రమే కనబడే "స్వంత పేర్ల " బ్లాగర్స్ వీళ్లు! :-) అంటే ఎవరో మనకు చెప్పనక్కరలేదు! ఈ "స్వంత పేర్ల" సెట్ లో ఉన్న కామెంట్స్: 9 

మొత్తం మీద "స్వంత పేరు" కు డెఫినిషన్ నేర్చుకున్నాం - thanks to gabbu gang!

(పై నీటిబొట్టు ఉన్నారే, వీరు రెండో భూతం! వీరు త్వరలో అక్కడ పోస్ట్ లు కూడా రాస్తారు. ఈ భూతాల గొడవ ఏమిటో తెలియాలంటే, ఈ పోస్ట్ పూర్తిగా చదవండి.)

To sum up, మొత్తం 79 కామెంట్స్ లో "స్వంత పేర్ల "తో రాసిన పరమ ధైర్య కామెంట్స్: 76 ! 

ఇంతకి ఆ 40 అజ్ఞాత కామెంట్స్ రాసిన ధైర్యవంతులు ఎవరో చెప్పగలరా? చెప్పినవాళ్లకు ప్రమాదవనంలో "స్వంత పేరు "తో ధైర్యంగా 3 కామెంట్స్ రాసే చాన్స్ ఇస్తారు ప్రమాదవనంను పాలిస్తున్న డెమాక్రసీ పరిరక్షకులు! నాలుగో కామెంట్ రాయకండి ప్లీజ్, ప్రేగులు తీసి వారి మెడలో వేసుకోబడతాయి.

ఇక చూడండి, రేపు "నిప్పురవ్వ" గారు లేదా "నీటిబొట్టు" గారు లేదా "మబ్బుతునక" గారు లేదా "మట్టిపెళ్ల" గారు లేదా "గాలిగోల" గారు (పాంచభౌతికం ఇదం ప్రమాదవనం!) మరొక టపా వేసేస్తారు ప్రమాదవనంలో. దాని పేరు ఏమిటో తెలుసా - "పంచభూతాల పంచకూళ్ల కషాయం"! ఆ కషాయాన్ని తాగి అక్కడ మన "స్వంత పేరు"తో ధైర్యంగా పొగిడితే మనం డెమాక్రసీని పాటిస్తున్నట్లు లెక్క. లేదో............................. 

Sunday, October 31, 2010

మరొక కొత్త డెఫినిషన్

డెమాక్రసీకి డెఫినిషన్ ఇచ్చాక, ఇప్పుడు కెలుకుడుకు డెఫినిషన్ ఇచ్చింది మన గబ్బు గాంగ్. అయితే సడెన్ గా ఈ డెఫినిషన్ ఎందుకు ఇస్తున్నారు? ఇన్నాళ్లుగా తాము చేసినది డెమాక్రసీలో భాగంగా చెప్పుకుంటు వచ్చారు. ఈ డొల్ల మాటలను బ్లాగర్స్ నమ్మటం లేదు అని తెలిసిపోయింది. కాబట్టి, ఇప్పుడు కెలుకుడు కొత్త డెఫినిషన్ ఇచ్చి క్రెడిబిలిటీ తెచ్చుకోవటానికి ట్రై చేస్తున్నారు. రాసినవారి పేరు కూడా మార్చారు. This character, Nippuravva, used to be active only in kelukudu posts. It generally adds fuel to fire in the comment war. కాని, ఇప్పుడు దాన్ని డైరెక్ట్ గా ఫీల్డ్ లోకి దింపి, ఒక పోస్ట్ రాయించారు.  

కెలుకుడుకు, విమర్శకూ డిఫరెన్స్ తెలియలేదు గబ్బుగాంగ్ మెంబర్స్ కు. నిన్న మొన్నటి వరకు  కెలుకుళ్ల మురుకుళ్లలో పొర్లీ పొర్లీ తామేం చేస్తున్నారో మర్చిపొయ్యారు. తాము బురదలో పడి దొర్లుతున్నామని ఈ లుల్లు లుల్లాయిలకు, ఎల్లాయి పుల్లాయిలకు మనం గుర్తు చెయ్యాల్సి వచ్చింది. అది గుర్తు చేశాక,  వాళ్ల తప్పులను ఎత్తిచూపాక, ఇప్పుడు కొత్త రాగం ఎత్తుకున్నారు. బ్లాగర్స్ అందరూ చేసున్నది కెలుకుడేనట. :-)

మనకు ఒకటి తెలుస్తున్నది. తాము బురదలో నుంచి బయటికి రావాలని అనుకోవటం లేదు. "మేమున్నది బురదే, మీరున్నది కూడా బురదే. అందుచేత మీరు బాధ పడనక్కరలేదు. అందరం అందులోనే ఉన్నాము కాబట్టి, ఊరికే బాధపడకండి" అంటు మనకు నచ్చచెబుతున్నారు. వీళ్లకున్న రోగమే ఇతరులకు కూడా ఉందని చెప్పుతున్నారు. తాము చేసిన పనులు తప్పేమీ కాదు, అందరు చేస్తున్నది అదేనని చెప్పుకుంటూ తమ తప్పులను కప్పేసుకోవాలని చూస్తున్నారు.

ఇప్పుడు తమ తప్పుడు పనులు బైటపడుతు ఉండేసరికి, తమ చాటుమాటు పనులు బట్టబయలు అయ్యేసరికి ముఖాలు కప్పుకోవటానికి మూరెడు బట్ట కూడా కనబడకపోయేసరికి కెలుకుడు అంటే మరేంటో కాదు, మనందరం చేస్తున్నదేనంటూ దొంగ మాటలు చెబుతున్నారు.

శర్మగారిని బజారుకు ఈడ్చి, రచ్చరచ్చ చేసారే, అది అందరూ చేస్తున్నారా? అది ఏపీమీడియా రామూ  గారు చేశారా?  అబ్రకదబ్ర  గారు చేశారా? వీవెన్ గారు చేశారా? బ్లాగాడిస్తా రవి గారు చేశారా? తాడేపల్లి గారు చేశారా? చాకిరేవు గారు చేశారా?  తన మానాన తానేదో రాసుకుంటూ ఉండే శర్మగారిని  పట్టుకుని బూతులు తిట్టారా వీళ్లు? లేదే!!

ఈ కెలుకుడు గుంపు లాగా మిగతా బ్లాగర్ల్స్ కూడా అజ్ఞాతల లాగ, ఫేక్ యూసర్ల లాగ కామెంట్స్ రాశారా? తోటి బ్లాగర్స్ ను బూతులు తిట్టారా?

ధూమ్, కాగడా లాంటి వాళ్లు ఛండాలమైన బూతులు రాస్తున్నపుడు, చప్పట్లు కొట్టి ఎంజాయ్ చేసింది, ఎంకరేజ్ చేసింది మిగతా బ్లాగర్లా? వీళ్లు కాదూ! ఒంగోలు సీనే చెప్పాడు, ఎంకరేజ్ చేశామని.

ఇప్పుడు ఈ కెలుకుడు వీరులు అందరు కలిసి, "కెలుకుడు అందరం చేస్తున్నాము, బాధపడకూడదు" అంటు సన్నాయినొక్కులు నొక్కుతున్నారు."కెలుకుడును బ్లాగ్జీవితంలో ఒక భాగం"గా ఫీలవ్వాలట! :-) అవినీతి చేశానని నన్ను అంటావేమిటి, నువ్వు చేసింది కూడా అవినీతే కదా అని పొలిటీషియన్స్ అన్నట్లుగా ఉంది వీళ్ల వాదన.

ఎందుకు వీళ్లు ఇలా తమ \తప్పుడు పనులను కవర్ చేసుకోవటానికి చూస్తున్నారు? బ్లాగర్స్ కు తమ కెలుకుడు నచ్చటం లేదని తెలిసిపోయినప్పుడు దాన్ని ఆపకుండ, "అందరూ చేస్తున్నార"ని సమర్ధించుకోవటం ఎందుకు? ఎందుకు ఇలా తమ హేట్రెడ్ కు క్రెడిబిలిటీ తెచ్చుకోవాలని చూస్తున్నారు? బండబూతులు తిట్టటానికి, విమర్శకి తేడా ఏమీ లేనట్లు మాట్లాడుతు ఉన్నారు ఎందుకు? ఎప్పుడు వదిలిపెడతారు ఈ హిపోక్రసీని?

Sunday, October 24, 2010

Their Anon games - An example

గబ్బు గాంగు వాళ్లు రెండు నాలుకలవాళ్లు అని, Anon games ఆడుతు ఉంటారని నేను చెబుతు ఉన్నాను. కాదు కాదని వాళ్లు అంటు ఉన్నారు.

"I told you we are what we are and do what we do! We do everything in hte open and it's you guys who are scared" అని తన బ్లాగ్ లో రాశాడు గబ్బర్. ఇందులో రెండు నిజాలు, ఒక అబద్ధము ఉన్నాయి.

నిజం 1: "I told you we are what we are and do what we do! " నేను కూడ అదే చెబుతున్నను, వీళ్లు ఏది అనుకుంటారో అది చేసి తీరుతారు. ఎవరు ఏమి అన్నా, వీళ్లకు నచ్చని టాపిక్స్ పై రాసే బ్లాగర్స్ ని హింస పెట్టడం వీళ్లు మానరు.

నిజం 2: "..and it's you guys who are scared" - ఇది కూడ నిజమే. ఈ గాంగ్ హెరాస్మెంట్ కు భయపడే ఇలా అజ్ఞాతంగా రాస్తున్నది. స్వంత పేర్లతో రాస్తే, మీరు మామీద (కుటుంబ సభ్యులను కూడ వదలకుండా)  ఏ విధమైన బార్బేరియస్ దాడి చేస్తారో మాకు తెలుసు. గతంలో ఎన్నో అకేషన్స్ లో చూశాము కదా!

అబద్ధం 1: "We do everything in hte open " - ఇది పచ్చి అబద్ధం. వీళ్లది ఎంత గబ్బు behavior అంటే, వీళ్ల ఓన్ ఐ.డి లతో కామెంట్స్ రాస్తు ఒక ప్రక్క డిస్కషన్ చేస్తూనే, మరో ప్రక్క, Anon comments రాసి అదే మనిషిని బూతులు తిడతారు. ఎన్ని బ్రౌజర్స్ వాడుతారో కాని, నిముషాల్లో వందల కామెంట్స్ రాస్తారు. నా బ్లాగ్ మూడవ పోస్ట్ లో గబ్బర్ అరగంటలో అరవై కామెంట్స్ రాసి స్పామ్ చేశాడు. చచ్చి చెడి వాటిని డిలీట్ చేశాను. :-)

మల్టిపుల్ బ్రౌజర్ విండోలను ఓపెన్ చేసిపెట్టి, ఒకచోట ఒరిజినల్ ఐ.డి తోటి, మరొక చోట Anonymous గా రాస్తు ఉంటారనుకుంటాను. శాంపిలుగా ఒకటి ఇస్తాను చూడండి.

http://ongoluseenu.blogspot.com/2010/06/blog-post_11.html  పోస్ట్ లో కామెంట్స్ చూడండి. June 14, 2010 నాడు ఒంగోలుకు, పిల్లకాకి (కృష్ణ) కి జరిగిన డిస్కషన్ లో-

3:25 PM: కృష్ణ ఒంగోలును ఒక ప్రశ్న అడిగాడు.
3:43 PM: ఒక Anon రిప్లై ఇచ్చాడు. కాని కంప్లీట్ గా ఇవ్వలేదు.
3:44 PM: Anon ఇచ్చిన రిప్లైని కంటిన్యూ చేస్తు ఒంగోలు కామెంట్ రాశాడు.
కొన్ని కామెంట్స్ తరువాత 3:49 కి రాసిన కామెంట్ లో "నా పై కామెంట్ అనానిమస్ గా ఎందుకు వచ్చిందో నాకు తెలీదు." అని అమాయకత్వం నటించాడు.

ఇదిగో ఈ ఇమేజెస్ చూడండి.




రెండు నాలుకలు:  ఒక నాలుక తిడుతుంది, రెండో నాలుక మామూలుగా మాట్లాడుతుంది. తిట్టే నాలుకకు పేరు ఉండదు -Anonymous, లేదా ఏదో ఒక ఫేక్ యూజర్నేమ్ ఉంటుంది. స్వంత పేరుతో ఉన్న నాలుక జనరల్గా పద్ధతిగా మాట్లాడుతుంది. ఇది వాళ్ల మోడస్ ఆపరాండి. అయితే, ఈ ఎక్జాంపుల్లో చిన్న డిఫరెన్స్ ఉంది. శ్రీనివాస్ చేత రాయించవలసిన కామెంట్ ను పొరపాటున Anon తో రాయించాడు. :-) తరువాత సర్దుకుని వెనువెంటనే తన ఒరిజినల్ ఐ.డి.తో రాశాడు. తను చేసే అజ్ఞాత కార్యాలు బయటపడతాయేమోనని, సర్దుకోటానికి ట్రై చేశాడు.

ఇలాంటివి ఆ కెలుకుడు మురుగులో ఎన్నో ఎన్నెన్నో.

Friday, October 22, 2010

మళ్లీ రుజువయింది

గబ్బు, గాంగ్ సభ్యులూ!

కెలికినన్ని రోజులు కెలికారు. కెలికి కెలికి బ్లాగ్ లను మురికి మురికి చేశారు. దారినపోయే ప్రతి దానయ్యను కెలుకుతుంటారు. ఎప్పుడో శర్మ గారిలాంటి వాళ్లు తగులుతారు, మీ తలపొగరు అణుస్తారు. మీ రాతల్ని రెగ్యులర్గా చదివే అందరికి తెలుసు, అజ్నాతలు మీరేనని, నిప్పులు, రవ్వలు మీరేనని, ముసుగులు మీరేనని, మురుగులు మీరేనని.

అయితే ఏంటి అని అంటారా? ఏముంది, మీరేంటో తెలిశాక, ఇకపై రాసే ఏ అనామక రాత ఎవరిదో, ఏ దొంగ రాతలు ఎవరు రాస్తున్నారో, చాలవరకు గ్రహించగలం.
-------------------------------------------------

వీళ్ల పోస్ట్లు చూడండి
పోస్ట్ మామూలూగా ఉంటే కామెంట్స్ కూడా సాదాగా, కూల్ గా ఉంటాయి. ఎవరిపైనైనా దాడి చేసినపుడు మాత్రం అనామక కామెంట్స్ లేదా shady users రాసే కామెంట్స్ పదులు, వందల్లో వచ్చేస్తాయి. వీళ్లు కెలుకుతున్న పోస్ట్ లకు మాత్రమే ఇలా అనామక కామెంట్స్ ఎక్కువగా వస్తాయి. మరెక్కడా అన్ని రావు.

శర్మ గారితో గబ్బు గాంగ్ గొడవ లొ కూడ అదే జరుగుతున్నది. శర్మ గారు రాసింది నాకు కూడ నచ్చలేదు. నచ్చనివాళ్లు చాలామంది ఉంటారు. కానీ వాళ్లు వాళ్ల బ్లాగుల్లో పోస్ట్స్ రాసి అతడిని తిట్టలేదు. నచ్చకపోతే ఆ సంగతి రాయవచ్చు. కానీ తిట్టటం ఎందుకు? చేసిన దంతా చేసి, మళ్లి డెమాక్రసీ అని హిపోక్రసీ వెలగబెడుతున్నారు. లుల్లూ చెప్పిన ఒక మాట - "Sarma garu wrote his post in a democratic way and Sreenu responded democratically too." LOOOLZ కదా! :-) ఇలాంటి జోకులు వేసి నవ్విస్తాడనే అతడికి లుల్లూ అని పేరు వచ్చింది.

సీను డెమాక్రటిక్ గా బూతులు తిట్టాడట. :-) శర్మ గారు కూడ డెమాక్రటిక్ గానే చావగొట్టారు. గబ్బరుసింగ్ అంటు ఉంటాడు నువ్వు ఒక చెంపన కొడితే మేము ఆ చెంపా ఈ చెంపా ఎడాపెడా వాయించేస్తాము అని. ఇప్పుడు శర్మ గారు చేసింది కూడా అదే- అందర్నీ కెలికినట్టే అతడినీ కెలకాలని చూశారు. అతడు వీళ్ల చెంపలు ఛెళ్ ఛెళ్ మనిపించటమే కాదు, చెవులు పిండి, తొడపాశం కూడా పెట్టారు.

"మేము నమ్ముతున్న దేవుడిని తిట్టాడు" అని అంటున్నది గబ్బు గాంగ్. మరి శర్మ గారు నమ్ముతున్న తంత్ర విద్యలను తిడితే ఆయనకు కోపం రాదా? మర్చిపోయాను, డెమాక్రసీ కదా! డెమాక్రసీలో కోపం గాంగ్ కే రావాలి కాని, మనకెవ్వరికీ రాకూడదు.

హైలైట్ ఏమిటి అంటే, విట్రియల్ "Define democracy!" అని లుల్లూను అడగటం. :-)

విట్రియల్ గారు, మీకు అక్కడ సమాధానం ఇవ్వటానికి గబ్బర్ సింగ్ సిగ్గుపడ్డాడు. నేను చెప్తాను: డెమాక్రసీ ఈస్ ఆఫ్ ది గబ్బు గాంగ్, బై ది గబ్బు గాంగ్, ఫర్ ది గబ్బు గాంగ్!

Wednesday, October 20, 2010

అసలే కోతులు

అసలే కోతులు
+ గుడ్డివి
+ పిచ్చెక్కింది
+ కల్లు తాగాయి
+ నిప్పుతొక్కాయి

ఇక అవి చేసే గోల ఎలా ఉంటుంది? మన గబ్బు గాంగ్ చేసే గత్తరలాగా ఉంటుంది.

గబ్బు గాంగ్ సంగతి ఏమిటి?

అది  అసలే గబ్బు గాంగ్
+ వాళ్లకు లుల్లూ లుల్లాయిలనే పేర్లు పెట్టారు
+ గబ్బు సింగులనే పేర్లు పెట్టారు
+ వాళ్ల రౌడీయిజాన్ని బ్లాగర్స్ ఎదిరించారు
+ anonymous లు, దొంగపేర్లతో వాళ్లు చేసే మాయలు, రాసే కామెంట్స్ గురించి బ్లాగర్స్ కు తెలుస్తున్నది.
+ బ్లాగ్ డెమాక్రసి అంటు వాళ్లు చేసిన డొల్ల వాదనలు బైటపడ్డాయి. ఎవరో ఒక బ్లాగర్ తన బ్లాగ్ లో ఏదో రాసుకుంటే ఆయనకి అటాకిచ్చి, అసభ్యంగా తిట్టారు.
+ కత్తి, ప్రవీణ్ లను ఎదిరిస్తున్నాం అనే వంకన బ్లాగర్లపై వాళ్లు చేస్తున్న దాడి దౌర్జన్యం బైటపడుతోంది. (అందువలననే తాము రాసిన పోస్ట్ లను తీసివేశారు.)

ఇన్ని ఎదురు దెబ్బలు తిన్నాక, ఇప్పుడు వీళ్లు చేసే గోల ఎలా ఉంటుంది?

అదుగో ఆ పైన చెప్పిన కల్లుతాగి, నిప్పు తొక్కిన, పిచ్చి, గుడ్డి, కోతుల గోల మాదిరిగా ఉంటుంది. అలాగే ఉంది.

ఇంకొక కామెంట్లాట

ఈ మలక్ గాంగ్ మరొక ఆట మొదలు పెట్టారు. అప్పల్రాజు బ్లాగులో జరుగుతున్న కామెంట్ల్స్ తమాషా చూడండి.. అజ్నాతల పేరుతో కామెంట్లు కుమ్ముతున్నారు. లుల్లూ, లుల్లాయిలు ఈ ఆటలో ముదుర్లు. వాళ్ల బ్లాగ్ అయినా, వేరే బ్లాగ్ అయినా కామెంట్స్ ఆట మాత్రం వాళ్లదే. ఒక కామెంట్లో తమని తిట్టుకుంటారు. నెక్స్ట్  కామెంట్లో తమని పొగుడుకుంటారు. అప్పల్రాజు బ్లాగ్లో కామెంట్స్ పెడుతున్న Anonymous లు చాలావరకు ఆ గాంగ్ లోని కేటుగాళ్లే. మహా మాయగాళ్లు. అలా రీడర్స్ ను  confuse చేస్తారు.

మాలికను తిడుతూ రాస్తున్న కామెంట్స్ ఈ కేటుగాళ్లు రాస్తున్నవే. మాలిక మీద ఉన్న అసూయ కారణంగా ఇలా బ్లాగ్ రాస్తున్నాడు అనే పిక్చర్ ఇవ్వటం దానివెనక వాళ్ల  ఉద్దేశ్యం. Devious bunch of cons.

This dirty gang of 'democracy torchbearers' has now become synonymous for "Anonymous"

Tuesday, October 19, 2010

గబ్బు సింగ్ - గబ్బర్ సింగ్ - గబ్బెస్ట్ సింగ్

లుల్లూ గాంగ్ను అసహ్యించుకునేవాళ్లు ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నారు. లుల్లూ లుల్లాయిల అసలు స్వరూపాలను బయటపెడుతున్నారు. ఈ టైములో అందరి ఎంటర్టైన్మెంట్ కోసం మరొక సెట్ పేర్లు ఇక్కడ ఇస్తున్నాను. 

కిందటి పోస్ట్లో చెప్పినట్లు these are the pseudonyms of the pseudonyms of the pseudo democracy-torchbearers, living in Telugu blogs.

ఈ పేర్లకు మూలం ప్రవీణ్ శర్మ పెట్టిన విడియో. అతడు ఈ లుల్లూ లుల్లాయ్ల మీద ఒక వీడియో పెట్టాడు. అందులో లుల్లూను గబ్బర్ గా, లుల్లాయిని, కారుతిక్కలోడిని అతడి అసిస్టెంట్స్ గా చూపించాడు. 

అసలు గబ్బర్ అంటే ఏంటో తెలుసా?  గబ్బు - గబ్బర్ - గబ్బెస్ట్ లలో రెండోది గబ్బర్. 

గబ్బరంటే మలక్కు, మరి మిగతా రెండు? నా ఒపీనియన్లో 
గబ్బు సింగ్ - కారు తిక్కలోడు (కార్తిక్)
గబ్బర్ సింగ్ - లుల్లూ alias మలక్
గబ్బెస్ట్ సింగ్ - లుల్లాయ్ alias ఒంగోలు సీను alias ఒంగోలు దున్న

ఈమధ్య వీళ్లు రాసిన నీచమైన పోస్ట్లు, కామెంట్స్ చూశాక, ఈ పేర్లు వీళ్లకు సరిగ్గా సరిపోతాయి అనిపించింది.

గబ్బెస్ట్ సింగ్ లుల్లాయికి బాగలేదు, లుల్లూకే ఇవ్వాలనుకుంటె మీ ఇష్టం. 

Monday, October 18, 2010

లుల్లూ, లుల్లాయ్ ఎవరనగా...

లుల్లూ, లుల్లాయ్ అంటే ఎవరని కొందరు అడిగారు. అది చెప్పటానికే ఈ పోస్ట్. ఒకే సెంటెన్స్ లో చెప్పాలంటే,
these are two of the pseudonyms of two of the pseudonyms of two of the pseudo democracy-torchbearers, living in Telugu blogs.

మలక్ పేట్ రౌడీ అని ఒక బ్లాగర్ ఉన్నాడు. lol lool loooool lolz, loolz, looooolz - ఇవి అతడికి ఊతపదాలు. ఒక రౌడిగాంగ్ ను గాదర్ చేసి రౌడిఇసమ్ చేస్తు ఉంటాడు. ఎవరైన ఈ ఊతపదాలను వాడితే అది నాది నా ట్రేడ్మార్క్ అని అంటాడు. అందువలన అదే ఇతడి పేరైతే సూట్ అవుతుందని అనుకున్నాను. అలా లోలూ, లూలూ వెలుగులోకి వచ్చాయి. ఇంకో రకంగా చెప్పాలంటే ఈ పేరులోని మొదటి లూ ఫస్ట్ నేమ్ గాను, రెండో లూ ను  లాస్ట్ నేమ్ గానూ అనుకోవచ్చు. లూ (loo) అంటే ఏమిటి అని డెఫినిషన్ అడగ వద్దు, google it. ఆ లూలూయే గ్రాడ్యువల్గా లుల్లూ అయింది.



లుల్లాయ్ గురించి. లుల్లూకి ఒంగోలు సీను అనే ఒక అసిస్టెంట్ ఉన్నాడు. అతడు తనని తాను ఒంగోలు దున్న అని పిలుచుకుంటు ఉంటాడు. అందుచేత అతడికి లుల్లాయ్ అని పేరు పెట్టాను. ఎందుకంటే, లుల్లాయము అంటే దున్నపోతు అని అర్థం ఉందట. లుల్లూకి దగ్గరగా ఉంది కదా, అది కూడ ఒక రీసన్.

వీళ్లు ఇద్దరు కలిసి బ్లాగుల్లో డెమాక్రసి తెచ్చామని చెప్పుకుంటు ఉంటారు. వీళ్ల నేతిబీరకాయ డెమాక్రసిలో నెయ్యి ఎంత ఉందో ఒంగోలు సీను రాసిన పోస్ట్లో చూడవచ్చు. దాని మీద నేను రాసిన పోస్త్ కూడ (ప్రీవియస్ పోస్ట్) చూడండి.

Saturday, October 16, 2010

ఆఫ్ లుల్లూ బై లుల్లూ ఫర్ లుల్లూ!

బ్లాగ్ డెమాక్రసీ పరిరక్షణ సమితి సమావేశం జరుగుతుంది అక్కడ. సమితి ప్రెసిడెంట్ లుల్లూ, క్లర్క్స్ లుల్లాయ్, కారుతిక్క ఉన్నారు అక్కడ. వాళ్లతోపాటు కారత్ చలం కూడ ఉన్నాడు. అతడు ఈ సమితిలో మెంబర్ కాదు. కానీ ఎక్కువగా అక్కడికి వస్తు ఉంటాడు. అతడు కామెడీ కబుర్లు చెబుతాడు కాబట్టి, కాస్త ఎంటర్టైనింగ్గా ఉంటుందని వాళ్లు అతణ్ణి పిలుస్తారు. అక్కడికి వెళ్తే తనకు అవసరమైన ఎంటర్టైన్మెంట్ తనకు దొరకక పోతుందా అనే ఆశ అతడికి.

లుల్లూ: "కారత్, నీ అసిస్టెంట్లు ఎవరూ రాలేదా?"
కారత్ చలం: "అసిస్టెంట్లా? ఎందుకు?"
లుల్లూ: "అదేంటి, మనలాంటి బ్లాగ్ బాస్ లకు అసిస్టెంట్లు లేకపోతే ఎట్లా? నాకు చూడు ఇద్దరు ఉన్నారు."
కారత్ చలం: "నాదగ్గర అసిస్టెంట్లుగా ఉండటానికి ఎవరూ ఇష్టపడటం లేదు లుల్లూ. ఎందుకో అర్థం అవటం లేదు."
నాకు తెలుసులే అని లుల్లూ మనసులో అనుకున్నాడు.
కారత్ చలం: "అయినా అసిస్టెంట్లను పెట్టుకుంటే మనీ వేస్టు కదా?"
లుల్లూ: "మనీ ఎందుకు? రోజుకు నాలుగో అయిదో హాఫ్ చాయ్ లు, వీక్లీ వన్స్ బిరియానీ. ఈమాత్రం కూడా పెట్టలేవా?"
కారత్ చలం: "అంతేనా? ఇంత చీపా!! లుల్లూ, నాకు కూడా ఒకళిద్దరు అసిస్టెంట్లను చూసి పెట్టవా?"
లుల్లూ లుల్లాయ్, కారు తిక్కలవంక చూశాడు. వెంటనే వాళ్లు ఇద్దరు లుల్లూ వెనక్కి పోయి దాక్కుని "ఒద్దొద్దు అన్నాయ్" అని కోరస్గా అరిచారు.
లుల్లూ: "సరే, సరే! మిమ్మల్ని ఇవ్వనులే. మరి నామీద ఎవరైనా జోకులు వేసినా నవ్వకుండా ఉంటారా?"
లుల్లాయ్, తిక్క: "నవ్వం నవ్వం"
లుల్లూ: "నేను జోకులు వేసినపుడు నవ్వి తీరాలి"
లుల్లాయ్, తిక్క: "నవ్వుతాం నవ్వుతాం"
కారత్ చలం లుల్లూను ఎడ్మైరింగ్గా చూస్తు ఉండగా, లుల్లూ అన్నాడు "ఇప్పుడు చెప్పు కారత్, ఎందుకు కలుద్దామని అన్నావ్?"

అసలు వీళ్ల మీటింగు ఎందుకంటే, ధర్మ అనే ఒక పెద్దాయన తన బ్లాగుల్లో ఇండియన్ ట్రెడిషనల్ సైన్సెస్ గురించి రాస్తున్నాడు. అతడు బ్లాగ్ డెమాక్రసీ పరిరక్షణ సమితి పర్మిషన్ తీసుకోలేదు. అది సమితికి నచ్చలేదు. దాన్ని అలాగే వదిలేస్తే బ్లాగుల్లో డెమాక్రసీ దెబ్బతినిపోతుందని వీళ్లు భయపడిపోయి, ఆ ప్రమాదాన్ని అడ్డుకోవాలని అనుకున్నారు. కారత్ చలంది డిఫరెంట్ ఐడియాలజీ! బ్లాగుల్లో బండబూతులు రాసుకోవాలి గానీ, ఇండియన్ సైన్సెస్ గురించి రాస్తే తప్పు కదా! అందుకని అతడు ఈ మీటింగ్ ప్రపోజల్ పెట్టాడు.

కారత్ చలం: "లుల్లూ, ఆ ధర్మ బ్లాగును ఎలాగైనా ఆపాలి. ఏంచేద్దాం?"
లుల్లాయ్: "వాడి బ్లాగులో బూతులు రాద్.."
లుల్లూ తనకేసి కోపంగా చూడటంతో సగంలో ఆపేశాడు. ఏం మాట్లాడినా లుల్లూయే మాట్లాడాలి, ఏదైనా చెయ్యాలంటే క్లర్కులు చెయ్యాలి. డెమాక్రసీ కదా! లుల్లాయ్ నోటి దురద కొద్దీ వాగుతుంటాడు. లుల్లూ అలుగుతు ఉంటాడు.
లుల్లూ: "ముందు అతడి బ్లాగులో ఇదేం బాగోలేదని రాద్దాం."
లుల్లాయ్: "అది చాలదు అన్నాయ్. మన బ్లాగుల్లో బూతులు రాయాల్సిందే.."
లుల్లూ: "రేయ్ లుల్లాయ్, లుల్లూ ఎవరు? నువ్వా నేనా?"
లుల్లాయ్: "నువ్వేలే, నువ్వే చెప్పు."
లుల్లూ: "తరువాత, మన బ్లాగ్స్లో అతణ్ణి తిడుతూ బూతులు రాద్దాం"
లుల్లాయ్: "వాటికి కామెంట్స్ కూడా మనమే..."
లుల్లూ కుర్చీలో నుంచి లేచి, నేల మీద గోడకు ఆనుకుని కూచోని, మోకాళ్ల మీద మోచేతులు, నెత్తి మీద అరచేతులు ఆనించుకుని, "నువ్వే చెప్పరా, నేను చెప్పలేను" అన్నాడు. లుల్లాయ్ అతణ్ణి చెయ్యిపట్టుకుని లేపి, "ఇక మాట్లాడనులే అన్నాయ్, నువ్వే చెప్పు." అన్నాడు.
లుల్లూ: (మళ్లీ కుర్చీలో కూచోని) "మన బ్లాగ్స్లో అతణ్ణి బూతులు తిడుతూ కామెంట్స్ మనమే రాసుకుందాం." అన్నాడు.
లుల్లాయ్: "నీ బ్లాగులో పారడి రాస్.."  .. "సారీ సారీ, నువ్వే చెప్పు."
లుల్లూ: "నా బ్లాగ్లో పారడి రాస్తాను."
కారత్ చలం: "నాకు పారడీలు రావు, కానీ ఎలా రాయాలో తెలుసులే."

అప్పటిదాక మాట్లాడకుండా ఉన్న కారు తిక్కలోడికి ఏమీ అర్థం కాలేదు. అడుగుదామంటే అన్నాయ్ ఏమంటాడో అని భయం. ఎలాగో ధైర్యం తెచ్చుకుని అడిగాడు, "ఇవన్నీ మనకెందుకు అన్నాయ్? ఆయన రాసుకుంటే రాసుకుంటాడు, మనకెందుకు?"
లుల్లాయ్: "డెమాక్రసీ అమ్మా డెమాక్రసీ!"
లుల్లూ: "రేయ్ లుల్లాయ్" అని కోపంగా అరిచి, నోర్ముయ్యమన్నట్టు చూశాడు. ఎంత అరిచినా మాట వినడని లుల్లూకు అర్థం అయింది. వీడిని కంట్రోల్ చెయ్యాలంటే ఒకటే మందు. దాన్ని వాడాడు.. "డెమాక్రసీ అంటే డిఫైన్ చెయ్యరా లుల్లాయ్" అని గద్దించాడు.
లుల్లాయ్: "అన్నా...య్!" అని దీనంగా అరిచాడు. అన్నాయ్ ఇచ్చే డెఫినిషన్ ట్రీట్మెంట్ ఇప్పటికే ఒకసారి అనుభవం అయింది అతడికి. అందుకే భయం వేసింది.
లుల్లూ: "డిఫైన్ చెయ్యమంటే అరుస్తావేంటిరా?"
లుల్లాయ్: "తెలీదన్నా?"
లుల్లూ: "మరి, నీకేదో చాల తెలిసినట్లు డెమాక్రసీ డెమాక్రసీ అని అరుస్తున్నావు ఏంటి?"
లుల్లాయ్: "అర్థం అయిందన్నాయ్, నేను మాట్లాడకూడదు, నువ్వే మాట్లాడాలి."
లుల్లూ: "అదీ అలా ఉండు" అని, మళ్లీ తానే "డెమాక్రసీ అంటే.. నేను నా ఇష్టం వచ్చినట్లు రాసుకుంటాను. నువ్వు కూడా నా ఇష్టం వచ్చినట్లే రాయాలి. సింపుల్గా ఇదీ డెమాక్రసీ అంటే! ఆ ధర్మ మనకు నచ్చనిది రాశాడు, మన పర్మిషన్ లేకుండా రాశాడు. అందుకని మనం పనిష్మెంట్ ఇస్తాం. అండర్స్టుడ్?"
తిక్క: "ఓహో, అర్థం అయిందన్నాయ్. నన్ను ఏమ్ చెయ్యమంటావు అన్నాయ్?"
లుల్లూ రిప్లై ఇచ్చేలోగా కారత్ చలం మాట్లాడాడు. "డెమాక్రసీ అంటే ఏంటంటే.."
లుల్లాయ్: "ఆగాగు, డెఫినిషన్ అన్నాయ్ చెప్పాడు కదా? అయినా ఇలాంటివి మనం చెప్పకూడదు, అన్నాయే చెప్పాలి."
లుల్లూ గర్వంగా మీసం మెలేసినట్టు action చేశాడు.
కారత్ చలం: "ఏడిశావులే, లుల్లూ అంటే నీకు పైనా కిందా దడదడ, నాక్కాదు. నాకు ఎవడైనా ఒకటే. మగాడా కాదా అనేది మాత్రమే చూస్తాను."
లుల్లాయ్: "కాదు కారత్.."
కారత్ చలం: "మూసుకోని చెప్పేది విను.. డెమాక్రసీ అంటే ఆఫ్ ది బూతు, బై ది బూతు, ఫర్ ది బూతు. అంతే."
తిక్క: "భలే భలే. బాగా చెప్పావు కారత్."
లుల్లాయ్: "ష్.. తిక్కలోడా, అన్నాయ్ ముందు వేరేవాళ్లను పొగడకూడదు."
తిక్క: "సారీ సారీ!"
కారత్ చలం: "నేను చెప్పడం అయిపోలేదు, ఇంకా ఉంది.. డెమాక్రసీ అంటే, మన బెడ్రూములో చేసే పనులు, కబుర్లను ఏరోజుకారోజు బ్లాగుల్లో రాయాలి. అందరినీ రాయమని చెప్పాలి. అట్లా మోడ్రన్ తింకింగ్ తో రాయటం అలవాటు చేసుకుని, అందరికీ అలవాటు చెయ్యాలి. మన private affairs కూడా ఈ మోడ్రన్ తింకింగ్ లోకి లాక్కురావాలి. There is no place for decency. చిత్తకార్తె కుక్క మనందరికీ ఆదర్శం కావాలి."

అందరూ: "సరే మనందరం మన బ్లాగులకు వెళ్లి అనుకున్న పనులను చేసేద్దాం, ధర్మను లొంగదీసి మనదారిలోకి తెచ్చుకుందాం, పదండి. జై బ్లాగ్ డెమాక్రసీ!"
కారత్ చలం: "లుల్లూ పద, నేనూ నీ బైకు మీద వస్తాను."
లుల్లూ: "నువ్వు బైకు వేసుకురాలేదా?"
కారత్ చలం: "నీ బైకు మీద వద్దామని ప్లాను వేసి, వచ్చేటప్పుడు ఆటోలో వచ్చాను"

Tuesday, September 21, 2010

ఎందుకు? ఏమిటి? ఎలా?

లూలూ, లుల్లాయ్ వంట చేస్తున్నారు. As usual, లూలూ వండుతుంటే లుల్లాయ్ హెల్ప్ చేస్తున్నాడు. అసిస్టెంట్ కదా!
లూలూ: రేయ్ లుల్లాయ్, సాల్ట్ తీసుకురారా!
లుల్లాయ్ సాల్ట్ బాక్స్ తెచ్చి
"ఇదుగో" అన్నాడు.
లూలూ: ఏంటిది?
లుల్లాయ్: సాల్ట్
లుల్లూ: ఏంటి గారంటి?
లుల్లాయ్ అయోమయంగా చూసి, "ఇది సాల్టే అన్నాయ్" అన్నాడు.
లూలూ: గారంటి ఏంటోయ్? దీని మీద రాసి ఉందా?
లుల్లయ్: లేదు.
లూలూ: అయితే ఇది సాల్ట్ కాదు అంతే. ఫో సాల్ట్ తీసుకురా పో!
లుల్లాయ్ మనసులో "ఈ తిక్కలోడి బాధ ఎప్పుడు ఒదులుతుందో" అనుకుని కొద్దిగా తిని చూసి, "ఇది ఉప్పే అన్నాయ్, ఉప్పగానే ఉంది"
లూలూ: ఐనా సరే, దాని మీద రాసి ఉంటేనే అది ఉప్పు, లేకపోతే నేనొప్ప.

లుల్లాయ్: ఛీ ఛీ, ఈ జప్ఫా గాడి దగ్గర బతికే కంటే...
----------------------
లూలూ, లుల్లాయ్ కారత్ చలంను కలవటానికి అతడుండే జంభారా హిల్స్ కు వెళ్లారు.
దారిలో లుల్లాయ్ చెబుతున్నాడు "కారత్ చలం వేటకుక్కల్ని పెంచుతూంటాడట బాస్, అవి చాలా ఫెరోశస్ అట, హైలీ డేంజరస్ అట"
లూలూ కళ్ళు పెద్దవి చేసి, "ఓహో అలాగా, మామూలు కుక్కల్ని పెంచుకోవచ్చుగదా, వేట కుక్కలు ఎందుకో"
లుల్లాయ్ "ఏమో బాసూ, నీ అంతటి తెలివైన వాడికే తెలియక పోతే, నాకేం తెలుస్తుంది?" అన్నాడు.

మరి కొంత సేపట్లో ఇద్దరు కారత్ చలం ఇంటి వద్దకు చేరుకున్నారు. లూలూ గేట్ తీయబోతూ ఉండగా లుల్లాయ్ ఆపి "అన్నాయ్, కుక్కలు ఉన్నాయని చెప్పారు గదా, తీయకు" అన్నాడు.
లూలూ "ఏదీ ఇక్కడ బోర్డ్ లేదు కదా?"
"చలం చాలా చాలూ కదా. బోర్డ్ పెట్టలేదేమో"
"నేను ఒప్పుకోను, బోర్డ్ లేకపోతే డాగ్స్ లేనట్లే, పద వెల్దాం" అని గేట్ తీయబోయాడు.

అప్పుడే కుక్కలు పరుగెత్తుకుంటూ గేట్ దగ్గరికి వచ్చాయి.

"అన్నాయ్, అవిగో కుక్కలు. ఎంత భయంకరంగ ఉన్నాయో చూడు, టైగర్ల లాగా. ఒకటి కాదు రెండు కాదు, మూడు. నోట్లోంచి చొంగ చూడు ఎట్లా కారుతుందో"

"నోర్ముయ్, "ఇక్కడ కుక్కలు ఉన్నాయి జాగ్రత్త" అని బోర్డ్ లేదు, కాబట్టి కుక్కలు లేవు అంతే! రావెల్దాం" అని గేట్ తీయబోయాడు.

"అన్నాయ్" అని పెద్దగా, కుక్క కరిచిన వాడి లాగా అరిచి, ఆపాడు. "ఎదురుగా కుక్కలు కనబడుతుంటే లేవు అంటావు ఏంటి బాసూ?" అన్నాడు ఏడుపు గొంతుతో.

"వాటిని కుక్కలు అంటారా? అయితే, కుక్కకు డెఫినిశన్ చెప్పు"

దెబ్బకు డంగై పోయిన లుల్లాయ్ పిచ్చి చూపులు చూడటం తప్ప ఇంకేమీ మాట్లాడలేకపోయాడు. అదే అదనుగా లూలూ గేటు తీసి లుల్లాయ్ ని ముందుకు తోసి, వెనుక తాను నడిచాడు.

Sunday, September 19, 2010

లోలూ, ది చాలూ!

పోర్న్ బ్లాగులు అగ్రిగేటర్స్లో చూపించాలా లేదా అనే డిస్కషన్ జరుగుతుంది. మాలిక, శరత్ ల మధ్య ఇస్యూ స్టార్ట్ అయింది. కాగడను చూపిస్తున్నావ్ కదా, నా బూతు బ్లాగ్ ఎందుకు చూపించవు అని శరత్ అడుగుతున్నాడు.

లోల్ (మలక్కు) చెప్పేది చదువుతుంటే నవ్వు వస్తుంది. బూతు అనే టాగ్ పెట్టెస్తే చూపించడు. ఆ టాగ్ లేకపోతే ఏ బూతు రాసుకున్నా పట్టించుకోరట. బూతు చూపించకూడదు గదా అని అడుగుతే, అసలు బూతు అంటే ఏంటి అని రివర్సు అడుగుతున్నాడు. అతడి సంగతి తెలియనిది ఏముంది?

లోలూ (మలక్కు)ది మహా కేటు బుర్ర! ఇదే ముక్క వీవెన్ ఒకప్పుడు అడిగితే అతడు, అతడి అనుచరుడు అరిచి, గోల చేసి, నీతులు చెప్పారు. ఇప్పుడు అతడు సరిగ్గా అదేపని చేస్తున్నాడు.

ఊరు అంతకీ జోష్యం చెప్పే బల్లి, కుడితి గాబులో పడిందట. అలా ఉంది ఇతడి పద్ధతి. ప్రీవియస్ పోస్ట్లో ఒంగోలు వారి హిపోక్రసీ చూశాం. ఇప్పుడు లోలూ (మలక్కు) వంతు.

లోలూ, బల్లి కబుర్లు ఆపి పని చూసుకోవోయ్.

Saturday, August 28, 2010

పాపం పిల్లకాకి!

మలక్ పేట్, ఒంగోల్ - వీళ్లిద్దరే వందమందితో సమానం. వీళ్లే నిప్పురవ్వలు, వీళ్లే అగ్గినిప్పులు, వీళ్లే అనానిమస్లు.

వీళ్లు తిడతారు, తమను తామే తిట్టుకుంటారు కూడాను. ప్రస్తుతం అదే జరుగుతున్నది రౌడీ బ్లాగులో. ఎవరో తిట్టారు. తిట్టింది ఆ పిల్లకాకి కృష్ణే (పిల్లకాకి - భలే పేరు పెట్టుకున్నావోయ్) అని అంటున్నారు. అతన్నితిడుతున్నారు. అది వాళ్ల పద్ధతి. ఈ పిల్లకాకికి ముందు పిచ్చికాకి అని స్టాంప్ వేశారు. ఇప్పుడు వాళ్లు రాసే బూతులను అతడు రాస్తున్నారని చెబుతూ అతణ్ని తిడుతున్నారు.

ఇన్నాళ్లుగా వాళ్లతో గొంతు కలిపి, వాళ్లు తిట్టేవాళ్లని తానూ తిట్టాడు ఈ పిల్లకాకి. ఇప్పుడు అతడి టర్న్. గతంలో తిన్న ఉండేలు దెబ్బల నుండి అతడు నేర్చుకున్నది ఏమీ లేదు. ఇప్పుడు కూడా ఏమీ నేర్చుకోడు. ఎందుకంటే.. కొన్ని జన్మలు అంతే!

Tuesday, August 24, 2010

ఒంగోలు శ్రీను గారూ

"..మూడోసారి!" అని అంటాననుకున్నారు కదూ? అనను! మీ సంగతి తేల్చటానికి రెండోదే అనవసరం! ఇక మూడో దానితో పని ఏముంది?

చచ్చిన పామును పట్టుకుని అమ్మాయిల ముందు హడావుడి చెయ్యటంలో మజా ఉందేమో నాకు తెలీదు కాని, చచ్చిన పామును చంపటంలో నాకు ఇంటరెస్ట్ లేదు. అందుచేత ఒంగోలు శ్రీను గారూ, మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఇక ముందు నా బ్లాగు ముందుకొచ్చి గొంతు లేపటానికి ప్రయత్నించే ముందు, నా ప్రశ్నలకి ఆన్సర్స్ పెండింగులో ఉన్నాయని గుర్తు పెట్టుకోండి.

రాఖీ సందర్భంగా ’సోదరి’కి మీరిచ్చిన మాటకు కట్టుబడండి.

Try to be true to yourself -for a change! Bye!!

-------------------------------------------------------------

ఒంగోలు శ్రీను గారూ - రెండో సారి!

మీ హిపోక్రసీకి సిగ్గనిపించటం లేదూ, ఒంగోలు శ్రీను గారూ?
అని మిమ్మలిని ఒక ప్రశ్న అడిగాను శ్రీను గారూ. దానికి సమాధానం లేదు ఇప్పటి వరకు. అదొక సూటి ప్రశ్న. మీ ప్రవర్తనలోని తప్పును ఎత్తి చూపుతూ, మీ ఆలోచనల్లోని తెలివితక్కువ తనాన్ని బయటపెడుతూ ఉదాహరణలను కూడా చూపిస్తూ అడిగిన ప్రశ్న అది. సమాధానం చెప్పటం మీబోటివాళ్లకు కష్టమేనని నాకు తెలుసు. ఎందుకంటే, ఒంగోలు శ్రీను గారూ, సూటి ప్రశ్నలను మీరు ఎదుర్కోలేరు.

అలాంటి ప్రశ్నలు ఎదురైనపుడు వందలకొద్దీ కామెంట్లతో గోల గోల చేసి, ఆ సందడిలో తప్పించుకుపోతూ ఉండే ముఠామీది.
సరిగ్గా అదే టెక్నిక్ను వాడారు నిన్న. ఈ బ్లాగులో కచ్చితమైన ప్రశ్నలు ఎదురయ్యాయి మీకు. సమాధానాలు చెప్పుకోక తప్పని పరిస్థితి. సమాధానం చెప్పాలంటే అది సంజాయిషీగా మారే పరిస్థితి. ఏమి చెయ్యాలో మీకు తెలియలేదు. అందుకే మీ దగ్గర ఉన్న ఆయుధాన్ని వాడారు. వందలకొద్దీ కామెంట్స్తో అయోమయాన్ని క్రియేట్ చేశారు. జనాన్ని ఆ అయోమయంలో పెట్టేసి తప్పించుకుపొయారు. ఒంగోలు శ్రీను గారూ, గోల ఆపారు కదా, రండి ఇప్పుడు చెప్పండి, మీ సమాధానం ఏమిటి?


తోటి బ్లాగర్లకు రంకు అంటగడితే మీకు కమ్మగా ఉంటుందా? అతడి సెన్సాఫ్ హ్యూమర్ను అభినందిస్తారా? అదే రంకు మీకు తగిలిస్తే, నొప్పి కలిగిందా? మీరు మీ ముఠాతో కలిసి ఆ రాసిన వాణ్ని రాచి రంపాన పెడతారా? అదేపని ఇతరులకు జరిగితే రాసినవాణ్ని అభినదిస్తారా?

మీ హిపోక్రసీకి సిగ్గనిపించటం లేదూ, ఒంగోలు శ్రీను గారూ?

నా ఇంతకు ముందు పోస్ట్లో రాసిన ప్రశ్నలకు సమాధానం చెప్పుతారా?

--------------------------------

మీ పోస్ట్లో ఒక వాక్యం ->కామెంట్స్ కి వేరే బ్లాగర్ల పేర్లు వాడి .. వారిని అవమానించకండి.>> దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందండీ ఒంగోలు శ్రీను గారూ!

Monday, August 23, 2010

ఒంగోలు శ్రీను గారూ!

ఒంగోలు శ్రీను గారూ!
బాగా రాశారండీ! కాకపోతే మీ అమాయకత్వం పతాక స్థాయికి చేరటం, ఆలోచనాశక్తి పాతాళానికి పడిపోవటం - రెండూ ఒక్కసారే జరగాయేమోనని నా సందేహం. సరిగ్గా ఆ సమయాల్లోనే మీరు పోస్ట్ లు రాస్తున్నారనుకుంటా. పోస్టుల్లో మీరు పొరపాట్లు రాసినా ఎవరికీ ఇబ్బంది కలగనంతవరకూ ఒ.కె. కానీ ఆ పొరపాటు రాతల కారణంగా సాటి బ్లాగర్లు ఎందుకు ఇబ్బంది పడాలి? "ఇబ్బంది పడ్డారా, ఎలాగ?" అని మీరు అడగవచ్చు. ఈ ఉదాహరణ చూడండి:

ఈ బ్లాగ్ రాసేవాళ్ళెవరో మీకు తెలియదు. ఎంతమందో తెలియదు. తెలియనప్పుడు తెలియనట్లుగానే ఉండాలి. కానీ ఊహించారు. సరే ఊహలు చెయ్యవచ్చు.. కానీ మీ ఊహే నిజమనుకుని వాళ్లను ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు. అది రైటా? మీ తెలివి తక్కువ తనం కాకపోతే, ఏమిటండీ ఆ మాటలు? మాలిక పాపులర్ అవుతుందని భయపడి మిమ్మ్లల్ని అన్పాపులర్ చెయ్యాలని భారారె ఈ బ్లాగ్ పెట్టాడా? నవ్వు రావటం లేదూ ఆ ఆలోచనకే? భారారె పగలబడి నవ్వుకుని ఉండాలి, మీ తెలివి తక్కువ తనానికి! మాలిక రావటంతో హారానికి వస్తున్న కోట్లాది రూపాయల ఆదాయానికి గండి పడిపోతుందనా ఆయన భయపడాల్సింది?

కానీ ప్రతి గొడవలోకీ కోతి, పెన్ను, కత్తీ అంటూ మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ హింస పెడుతూ ఉన్నారే - మీరు పెట్టిన హింసకు మాత్రం భారారె లాగా నవ్వుకునే పరిస్థితి వాళ్లకు ఉందని అనుకోనండి! చూసేవాణ్ని నాకే కష్టంగా ఉంటుంది మీ ఆరోపణలకు. వాళ్లకు ఎల్చా ఉంద్డోగాని. వాళ్ల రాతలు, వ్యాఖ్యలూ నచ్చని వాళ్లు చాలామంది ఉన్నారు. అంత మాత్రాన, వాళ్లు మీలాగా ప్రతీ దానికీ వాళ్లపై ఇలా అవాకులూ చెవాకులూ రాస్తున్నారా?

>అక్కడ నేను పెట్టిన కామెంట్స్ అంటారా ... అతను రాసిన కొని విషయాలకి అతని సెన్సాఫ్ హ్యూమర్ కి మనలో చాల మంది మెచ్చుకుని ఈ టాలెంట్ సక్రమ మార్గం లో వాడితే బాగుండేది అనుకున్నాం కాదనలేని నిజం.>> - ఎంత గొప్ప నిజాన్ని రాశారు!! అద్భుతమైన వాక్యాలు ఒంగోలు శ్రీను గారూ! కాగడా బూతులు రాసింది మీపైన కాదుగదా, అందుచేత అతడి సెన్సాఫ్ హ్యూమరుకు ఆనందించారు. అతగాణ్ని దారిలో పెడదామని ప్రోత్సహిస్తూ కామెంటు రాశారు. మరి నా బ్లాగులో బూతులు ఎందుకు రాశారు? నన్ను కూడా అభినందించి ప్రోత్సహించాల్సింది కదా? తేడా ఏమిటో తెలుసా -ఇక్కడ టార్గెట్ మీరు! ఇక్కడ కూడా నేను వాళ్లల్నే తిట్టి ఉంటే.., "ఎయ్యి బాసూ ఇరగదీయ్" అంటూ మీరే కామెంట్లు రాసి ఉండేవారు. నా writing skills ను ప్రోత్సహించి మంచిదారిలో పెట్టాలి గదా మరి!!

మీ హిపోక్రసీకి సిగ్గనిపించటం లేదూ, ఒంగోలు శ్రీను గారూ?

ప్రవీణ్ మిమ్మల్ని తిట్టినపుడు ’ఏదోలే అమాయకుడు’ అని వదిలెయ్యకుండా, అతన్ని ప్రోత్సహించకుండా మీరు అతని మీద తిరగబడ్డారేంటి? మీ దాకా వస్తే ఒక పద్ధతి, అవతలి వాళ్లకు జరుగుతుంటే ఒక ధోరణీనా?

మీది ఎంత హిపోక్రసీయో తెలుస్తుందా, ఒంగోలు శ్రీను గారూ?

>ఆయన గారు నన్ను అడ్డమైన మాటలు అనగా లేనిది నేను సరదాగా ఒక పోస్ట్ పెడితే .. చూడండి ఎంత గొడవ చేస్తున్నాడో?>> - ఆయన అడ్డమైన మాటలు అంటే, మీరు సరదాగా ఒక పోస్టు పెట్టారా? మరి మీరు పెన్ను, కోతి, కత్తులు అంటూ రాసిన రాతలకు వాళ్లు ఏం చెయ్యాలి? పాపం, వాళ్లు మౌనంగా సహించారు తప్ప, ఏమీ చెయ్యలేదు.

వాళ్లు కూడా మీలాగే అనుకుని ఉంటే, ఎంత రచ్చ జరిగి ఉండేది, ఒంగోలు శ్రీను గారూ?

>మీ బ్లాగు వీక్షణం లో అజ్ఞాతలు నను అడ్డమైన కూతలు కూస్తే మీరు డిలీట్ చెయ్యరు కానీ నా బ్లాగులో మీ ఫేక్ పేర్లు పెట్టుకుని తిట్టే వాళ్ల గురించి మాట్లాడుతారు.>> - కష్తం కలిగింది కదూ! ఔను, నిజంగా కష్టంగానే ఉంటుంది తమ్ముడూ. మీరు రాసిన రాతలకు అవతలి వాళ్లకు ఎంత కష్టం కలుగుతుందో తెలిసింది కదూ! తీసేస్తాను. వాటన్నిటినీ తీసేస్తాను. కానీ దానికంటే ముందు మీరొక పని చెయ్యాలి. నా మొదటి పోస్టులో, మీరు స్వంత ఐడీని బైట పెట్టటానికి ముందు anon comments రాసింది మీరేనన్న నిజాన్ని ఒప్పుకోండి, వెంటనే తీసేస్తాను. నేను అక్కడే చెప్పాను, ఆ anon మీరేనని.


>ప్రవీణ్ తప్పులు ప్రశ్నిస్తే ఇప్పుడు ధూమ్ కాగాడాలని తెర మీదకి తెచ్చారు . ఇక మిగతాది మీ విజ్ఞత కె వదిలేస్తున్నా>> - శ్రీను గారూ, మీరు అమాయకత్వం నటిస్తున్నారా లేక నేను మొదటి పేరాలో రాసినట్లుగా నిజంగానే అది శిఖరస్థాయిలోఉందా? మీ గ్రూప్ లీలల్లో ప్రవీణ్ ఎపిసోడ్ చాలా చిన్నది బాబూ. మీకు తెలియంది చాలా ఉంది. మీకు త్వరలోనే తెలియాలని కోరుకుంటున్నాను!

>బలవంతంగా అయినా గౌరవ పరమైన భాషతో ఇక నుండి ఆవేశపడటం అలవాటు చేసుకుంటాలెండి>> - మంచిగా మారేందుకు ఎంతలా కష్టపడాల్సి వస్తోందో చూశారా? :-) Anyway, all the best! I hope, you will change for the better and.. change for good.

చివరగా నాది ఒక మాట - బ్లాగుల్లో గ్రూప్స్ ఉన్నాయి వాళ్లను ఎదుర్కోవాలి అంటూ మీరు గ్రూప్స్ పెట్టి అడ్డమైన చెత్త రాశారు కాని, నిజానికి గ్రూప్స్ మొదలుపెట్టుంది మీరు. గ్రూప్ గా చేరి, సాటి బ్లాగర్లను అవమానించింది మీరు.

ఇక మీతో నా పని అయిపోయింది. బై!

Sunday, August 22, 2010

ఈ హేటర్స్ చేసిన నీచపు పనులు మీకు తెలుసా?

ఈ హేటర్ల గ్రూపు చేసిన నీచపు పనులు ఇన్ని అన్ని కాదు.

వీళ్లు తమ హేట్ బ్లాగులని ప్రవీణ్ తోటే ప్రారంభించలేదు, అంతకు ముందు నుంచే వాళ్లు బ్లాగుల్లో విషం చిమ్మటం మొదలు పెట్టారు. ప్రవీణ్ ఎపిసొడ్ రీసెంట్గా మొదలైనది. అలాగే ఇప్పుడు ఉన్న గ్రూప్ మెంబర్స్ కొందరు అప్పుడు లేరు. కొందరు కొత్తగా వచ్చినవాళ్లు కూడా ఉన్నారు. ఈ కొత్తగా వచ్చినవాళ్లకు పాతవాళ్లు ట్రైనిన్గ్ ఇస్తూ ఉంటారేమో తెలియదు కాని, సీనియర్ల హెరాస్మెంట్ అంటూ వీళ్లు కూడ పాట పాడుతు ఉంటారు. అసలు హెరాస్మెంటు ఎవరు చేశారో చూద్దాం.

బ్లాగుల్లో సీనియర్లు గ్రూపులు కట్టి, కొత్తగా వచ్చినవాళ్లను హెరాస్ చేసి, వాళ్లను ragging చేశారని ఈ హేటర్ల గ్రూపు ఎప్పుడూ చెబుతూ ఉంటుంది. అది చెప్పి, తామేదో సీనియర్ల నుండి జూనియర్లను కాపాడటానికి వచ్చిన ఏంజెల్స్ లాగ ఫోసులు కొడుతు ఉంటారు. ఎంత ఓవర్గా చెబుతారు అంటే, ఇక్కడ హిట్లరు రాజ్యమేలుతూ ఉన్నట్లు, తాము వచ్చి, ఇక్కడి ప్రజలను రక్షించినట్లూ ఉంటుంది అది. కాని నిజానికి జరిగింది అది కాదు, సీనియర్లు కొత్తవాళ్లకు పెట్టిన హెరాస్మెంటు కంటే, ఆ పేరు పెట్టుకుని వీళ్లు పెట్టిన హింస అనేక రెట్లు ఎక్కువ.

బ్లాగులు పెట్టిన కొత్తవాళ్లకి సీనియర్లు సలహాలు ఇవ్వటం నార్మల్గా జరిగేది. అయితే ఆ సలహాలు ఇవ్వడంలో కొన్నిసార్లు సరైన భాష వాడకపోవటం, కొంత దురుసుగా ఉన్నట్లుగా అనిపించటం వంటివి ఉండి కొత్త బ్లాగర్స్ బాధపడి ఉండవాచు. అది కొత్త పాత అనే తేడా లేకుండ ఇప్పటికీ ఉంది.

అయితే ఆ కారణం చెప్పుకుని వీళ్లు చేసిన అరాచకం గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. వీళ్లు నిజం బూతులు రాసేవాళ్లు. అలా రాయటం తప్పేమీకాదు, అది మా right of speech అనేవాళ్లు. ధూమ్ మచారా అని ఒక బ్లాగు పెట్టారు. అందులో బ్లాగర్లను విమర్శించటమే కాదు, బూతులు కూడా తిట్టేవాళ్లు. కాగడా అనే మరొక బ్లాగును పెట్టారు. అందులోనైతే సాటి బ్లాగర్లనే పాత్రలుగా పెట్టి బూతు కథలు రాసేవాళ్లు. చాలా నీచంగా ఉండేవి అవి. చూడండి, నాకూ మీకూ సంబంధం అంటగడితే ఎలా ఉంటుంది? అవి చదివితే, సంస్కారం కోల్పోయిన మనిషి ఏ స్థాయికి ఎంత దిగజారిపోగలడో తెలుస్తుంది. ఈ గాంగ్ లోని వాళ్లందరూ అక్కడ వ్యాఖ్యలు రాసి, ప్రోత్సాహాన్ని ఇస్తూ, మరి కొన్ని బూతులను ఆడ్ చేస్తూ ఆనందించేవాళ్లు. వాటిలో రాసిన బూతులను చూసి అప్పట్లో కొందరు లేడి బ్లాగర్స్ వాళ్ల బ్లాగ్లను క్లోస్ చేశారు కూడా. తప్పని పరిస్థితి అది -అక్కడ రాసిన రాతల్లో ఉండే పేర్లు అన్నీ కొట్టవచ్చినట్లుగా బ్లాగర్ల పేర్లని తెలిస్పోయేవి. అవి వాళ్ల కుటుంబ సభ్యులెవరైనా చదివితే, చాలా అవమానకరమైన పరిస్థితి తల ఎత్తుతుంది వాళ్లకి.

బ్లాగుల్లో బూతులు రాసుకుంటే ఇష్టపడే వాళ్లు చదువుతారు, లేనివాళ్లు చదవరు. ఉదాహరనకు శరత్ రాస్తు ఉంటాడు. కాని సాటివారిని పాత్రలుగా పెట్టి వాళ్లపై కథలు అల్లడు. కాని ఈ హేటర్స్ చేసినది ఏమిటి? బూతులను సాటి బ్లాగర్లకు అన్వయించి రాశారు. వాళ్ల మధ్య అక్రమ సంబంధాలు క్రియేట్ చేశారు. అది ఎంత అసభ్యంగా ఉంటుంది? ఎటువంటి వాతావరణం క్రియేట్ చేశారంటే, కొన్ని బ్లాగ్స్లో కొందరు కామెంట్స్ రాయటం మానేశారు. కొందరు బ్లాగర్స్ తమ బ్లాగ్లను మూసేశారు. ఈ హేటర్ల గ్రూపు నిర్వాకం అది.

ఈ బూతు ఎపిసొడ్స్లో ప్రధాన పాత్ర వహించిన వాళ్లు ఇప్పటికీ ఈ గ్రూప్ మెంబర్సే! వీళ్ల black history గురించి ఇన్నాళ్లు ఎవరూ మాట్లాడలేదు కదా, ఎవరికి ఏమీ తెలియదని వీళ్లు అనుకుంటూ ఉన్నారు. వీళ్ల నీచ మనస్తత్వాలను, వీళ్ల దుర్మార్గమైన కుసంస్కారాల గురించి బ్లాగర్లకు తెలియవలసింది ఇంకా చాలా ఉంది.

---------------------------------------
update: ఈ పోస్ట్ కు ఒక యానన్ రాసిన వ్యాఖ్యను ఇక్కడ ప్రచురిస్తున్నాను. అది ఇక్కడ ఉండతగినది.

సోదరి గారూ, అసలు ప్రతి దానికీ సీనియర్ల పేర్లను అనుకరిస్తూ పేర్లు పెట్టి ఎంత ఛండాలంగా రాశారో మీకు తెలుసా? ఇంకా రాస్తున్నరు చూశారా? ఈ బ్లాగు సంగతే చూడండి.. క్యోతి, పనికిమాలిన పెన్ను, కత్తి, భారారె - అసలు వీళ్ళ పేర్లు ఎందుకు వాడాలి వీళ్ళు? ఏమిటి వీళ్ళ ఉద్దేశం -ఎవర్నైనా ఏమైనా అనవచ్చుననా? వాళ్ళు ఏమి మాట్లాడినా ఎవరూ ఏమీ అనలేరు, అనరు అనే ధీమానా? మీరు చెప్పండి, వాళ్ళు ఈ పేర్లన్నిటినీ వాడారా లేదా? (సూచనాప్రాయంగా చెప్పారులెండి. అర్ధం చేసుకోకపోవటానికి మనమేమీ పసిప్రాయులం కాదు, పశుప్రాయులమూ కాదు). పోనీ ఎవరో కరో ఇద్దరో చేశారని అనుకుండ్దామండి, అందరూ ఉన్నారంటారా? ఎందుకు ఆ బ్లాగర్ల మీద వీళ్ళకు అంత ద్వేషం? సరే, ఎందుకో ద్వేషం ఉంది అండీ, ప్రతీ దానికీ వాళ్ళను ఎందుకు ఆడిపోసుకుంటున్నారు? ఏ చిన్న గొడవ ఐనా, వాళ్ళను ఇష్టం వచ్చినట్టు తిట్టటం ఏంటి? ఏదో ఒకరోజున నిజమేంటో తెలియకపోదు. ఆనాడు వాళ్ళు తిట్టిన తిట్లకు పరిహారం ఏంటి?


Friday, August 20, 2010

చూశారా వాళ్లు చేస్తున్న రభస!

నా గత పోస్ట్ తరువాత వాళ్ల బ్లాగుల్లో జరుగుతున్న వ్యవహారాలు చూస్తున్నారు కదా.  నా పోస్ట్ కు వాళ్ళలో కొందరు రాసిన  కామెంట్లను చూస్తే, అక్కడ చూసింది చాలా తక్కువ అనిపిస్తుంది. వాటిని ప్రచురించలేదు. అంత నీచంగా రాశారు. తాము చేసే పనులను విమర్శించే వాళ్ళంటే వాళ్లకు ఎంత మంటో!

ప్రస్తుతం వీళ్లేం చేస్తున్నారు అంటే, జాతరలలో పూనకాల పోతురాజుల లాగ వూగిపోతు గంతులేస్తున్నారు.  వీళ్లు మన బ్లాగు ముంగిటిలోకి వచ్చినపుడు మర్యాదగా మాట్లాడి పంపించాలి. లేకపోతే మన బ్లాగులోనే దుకాణం పెట్టి, అందరూ చేరి రభస చేసి పోతారు. నేను వాళ్లకు అంత మర్యాద చెయ్యలేదు గదా అందుచేత నా బ్లాగుకు వాళ్లు ఆ మర్యాద ఇస్తున్నారు.

కొందరు బ్లాగరులు గుంపులు కట్టారని, వాళ్లు కొత్త బ్లాగర్లను హెరాస్ చేస్తుంటారని వీళ్లు మెడల్లో డోళ్లు కట్టుకుని టమటమా వాయించుకుంటూ అమెరికా నుంచి ఆఫ్రిక వరకు తిరిగారు. అసలు వీళ్లు చేసేది, చేస్తున్నది అదే -గ్రూపులు కట్టి, ఇతర బ్లాగర్లను హెరాస్ చెయ్యటం. బ్లాగుల్లో తిరుగుతూ తమకు నచ్చని వాళ్ల బ్లాగులో స్పాట్ పెట్టి, గాంగ్ మెంబర్స్ అందరూ అక్కడ చేరి, వాదన పెట్టుకుని రచ్చ చేస్తారు. ఎవరి బ్లాగుల్లోవాళ్లు తమకు నచ్చింది రాసుకుంటారు. వీళ్లకెందుకు? ఒకవేళ నచ్చకపోతే, దాన్ని విమర్శ చెయ్యవచ్చు. కాని దానికి కూడ పద్ధతి ఉంటుంది కదా! బ్లాగరును అవమానపరుస్తూ రాసి, హింసిస్తారు. ఒకడి వెంటనే పదిమంది వచ్చి అల్లరి అల్లరి చేస్తారు. తప్పనిసరి పరిస్థితిలో ఆ బ్లాగరు తానే వెనక్కి తగ్గాల్సి వస్తుంది. ఎవరో గ్రూపులు కట్టి హెరాసు చేస్తున్నారని చెప్పుకుంటూ, తాము చేసే పని ఇది. పైగా ఈ వ్యక్తిగత దాడులకు sanctity ఇచ్చుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు.

ఉదాహరణకు, నా మొదటి పోస్ట్ సంగతి చూడండి. అందులో నేను రాసినది ఏమిటి? వీళ్ల అల్లరి పెచ్చుమీరి పోయింది, హింస పెట్టెస్తున్నారు అని నేను గోల చేసాను. కానీ వీళ్లు అసలు విషయాన్ని పక్కన పెట్టి, ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేశారు. నేను మాలిక మీద ద్వేషంతో రాస్తున్నానట. ఏదో ఒక రంగు పులిమి, తమ మీద దాడి జరుగుతున్నట్లు ప్రచారం చేసి, ఆ పైన తమకు ఇష్టం వచ్చినట్లు తిట్టే ప్రయత్నం ఇది.

గతంలో కూడ, కొందరు బ్లాగర్లు గ్రూపులు కట్టి తమను ఎగతాలి చేసారని చెప్పి వాళ్ళను అనరాని మాటలు అన్నారు. బూతులు తిట్టారు. కొందరు బ్లాగర్లకు సంబంధాలు అంటగట్టి ప్రచారం చేశారు. నోరు ఉంది కదా అని తమకు నోటికి వచ్చినదల్లా రాశారు. అసహ్యంగా ప్రవర్తించారు. కూడలి తమకు ఎగెనెస్ట్ గా పని చేస్తుందని దాని మీద దాడి చేశారు. అందుకే మాలిక పెడుతున్నామని చెప్పారు. తరువాత, హారం భాస్కరరామి రెడ్డి తమమీద ఏదో దాడి చేశారని అతని మీద దాడి చేశారు. ఇప్పుడు కూడా, ఈ బ్లాగ్ ను ఆయనకే లింకు పెట్టారు.

అసలు నా ఈ బ్లాగ్ ను ఎంతమందితో లింకు పెట్టుతున్నారో చూడండి.. కొత్తపాళి, కత్తి, మహిళా బ్లాగరులు,.. వాళ్ల ఇష్టం. వాళ్ల టెక్నిక్ చూడండి, ఎక్కడా నేరుగా పేరు పెట్టరు, పేరు స్ఫురించేలా వేరే పేరుతో తిడతారు. వీళ్ల నాయకుడు వీళ్లకు బాగా కీ ఇచ్చి ఒదిలిపెడుతాడు, వీళ్లు రెచ్చిపోతారు. అతడు మధ్యమధ్యలో వచ్చి నాలుగు బూతులు రాసి పోతాడు. భలే రాసావు అన్నయ్యా అంటూ వీళ్లు మరింతగా రెచ్చి గంతులేస్తారు.

అసలు తిట్టడమేమిటి?  బరితెగించిన వాళ్లు ఎట్లా మాట్లాడినా, ఎటువంటి బూతులు రాసినా చెల్లుతుందని అనుకుంటున్నారా? అనుకుంటున్నట్లే ఉన్నారు. నా బ్లాగులో వాళ్లు రాసిన కామెంట్లు చూసినా, వాళ్ల బ్లాగుల్లో వాళ్లు రాస్తున్న కామెంట్లు చూసినా అలాగే అనిపిస్తుంది. ఈ అసభ్య రాతల నుండి తెలుగు బ్లాగరులకు మోక్షం ఎప్పుడో కదా!!

Thursday, August 19, 2010

ఈ బ్లాగును సంకలినులలో చూపవద్దు

కూడలి, జల్లెడ, హారం, మాలిక పెద్దలకు వినతి.

ఈ బ్లాగును మీ సంకలినుల్లో చూపితే సంతోషం. కానీ ఇక్కడి వ్యాఖ్యలను మాత్రం చూపకండి. బ్లాగుల్లో చెత్త వ్యాఖ్యలు రాస్తు పనికిరాని పోసుకోలు కబుర్లు చెబుతూ, ప్రవీణ్ని తిట్టటం అనే ఏకైక అజెండాతో రాసే ప్రవీణ్-హేటర్ల గుంపు ఒకటుందని మీకు తెలుసు. ఆ రాతలతో విసుగెత్తటం వల్ల నేను ఒక పోస్ట్ రాసాను. దాంతో వాళ్లు ఇక్కడికి కూడా తయారయ్యారు. ఇక్కడ కూడా హేటురాతలు రాస్తున్నారు.  ఎప్పటి లాగానే ఎందుకూ పనికిరాని చెత్త అది. మనసులు పాడవటం, టైమ్ వేస్ట్ అవటం తప్పించి వాటి వలన మరో ప్రయోజనం ఉండదు. అంచేత నా బ్లాగ్ నుంచి వ్యాఖ్యలను తీసుకోవద్దని మనవి.

Wednesday, August 18, 2010

తెలుగు బ్లాగరుల్ని రక్షించండి బాబోయ్!

నమస్కారం! బ్లాగ్లకు కొత్తవాడిని కాదు. చాల రోజుల నుంచి రాయాలని అనుకుంటున్నవి ఇక్కడ రాస్తున్నాను.

నా టెంప్లేటు చూసారు కదండి. బాక్ గ్రౌండులో చాల బుక్సున్నాయి. అవి ఏ పుస్తకాలో తెలియదు. రకరకాల రంగుల్లో, షేపుల్లొ ఉన్నాయి. (అయితే వాటికి పేరూ ఊరూ లేదు అనుకోండి.) ఏ బుక్ తెరిచిచూస్తె ఏమి ఉంటుందో తెలియదు. ఏదో ఒక పుస్తకం చదవాలని మనం వచ్చాం. అవన్నీ మనకు నచ్చని  పుస్తకాలే అనుకోండి. ఏమిటి మన పరిస్థితి? ప్రస్తుతం తెలుగు బ్లాగ్ల స్థితి అలా ఉంది. బ్లాగ్ అగ్రిగేటర్స్ అనే పుస్తకాల రాక్లో ఎక్కువగా బూతు పుస్తకాలే ఉన్నాయి. ఐతే, అన్నిటికీ అట్ట మీద రాసే ఉంది, బూతు పుస్తకమని. మంచి పుస్తకం గంజాయి వనములో తులసి మొక్కలా అయిపోయింది.  ఏ కూడలికి వెళ్ళి చూసినా, ప్రవీణ్ ను తిడుతూ రాసే పోస్టులే. తిడుతూ రాసే కామెంట్లే!! ఒక  గుంపు తయారయ్యింది. వీళ్లకి ఆ ప్రవీణ్ మీద పడి ఏడవటం తప్పించి వేరే పని ఉన్నట్టు లేదు. వీళ్లు ఏడిస్తే నాకు పోయేదేమీ లేదు కానీ, కూడలి, హారం, జల్లెద, మాలిక -ఎక్కడికి పోయినా ఈ దరిద్రం చూడలేక చచ్చిపోతున్నాను. అందుకే ఈ పోస్టు.

ఈ పనికిమాలిన గాలి గుంపు వచ్చాక బ్లాగులు, వ్యాఖ్యలు చూడాలంతే చిరాకు వచ్చేస్తోంది. పోస్టులో పెద్ద కంటెంట్ ఏమీ ఉండదు. ఏదో ప్రవీణ్ను తిడుతూ నాలుగైదు వాక్యాలుంటాయి. ఇక ఆ తరువాత ఆ బాచ్ వాళ్లందరూ అక్కడ చేరతారు. ప్రవీణ్ని తిడుతూ, ఎగతాళి చేస్తూ వందలాది కామెంట్లు రాస్తారు. అనుచితంగా ఉండని కామెంట్లు చాలా తక్కువ. ఒక 10, 15 మంది ఉంటారు ఈ గుంపులో. అందరూ కలిసి ఒక ఐదారు వందల nasty comments రాస్తారు. చివరికి పరిస్థితి ఎలా తయారు అయ్యిందంటే ప్రస్తుతం ఈ రౌడీలు అందరి కంటే కూడా ఆ ప్రవీణే చాలా నయమని అనిపిస్తుంది నాకు. ప్రవీణ్ మీద నాకు ప్రత్యేకమైన అభిమానము ఏమీ లేదు, కానీ అన్యాయమైన వ్యక్తిగత దాడికి, పిచ్చివాళ్ళ గుంపు యొక్క నీతిమాలిన తిట్లకు అతడు బలి అవుతున్నాడని నాకు అనిపిస్తుంది.

ఇలా ప్రవీణ్ను తిట్టటం మర్యాదగా ఉందా అని ఈ మధ్య అజ్నాతలు వీళ్లకు గడ్డి పెట్టబొయ్యారు. కానీ గడ్డి తినటానికే అలవాటు పడినవాళ్లకు మనం గడ్డి వేస్తే అది పరమానందం కదా, పరమాన్నమే కదా! ఈ గుంపులో ఉన్న ఒక ఆడమనిషికి బాగానే గడ్డి పెట్టారు ఒక అజ్నాత. కానీ ఆమె దులిపి వేసుకు పోయింది. అలా ఉంది వీళ్ల మూర్ఖత్వము! వీళ్ళలో ఒకళ్ళిద్దరు తమ బ్లాగుల్లో చక్కగానే రాస్తుంటారు. ఇతర బ్లాగుల్లో మాత్రం ఇలాంటి చెత్త రాస్తారు.


అయితే వీళ్ళు చాలా బెటర్ రా బాబూ అనిపించే మనిషి(?) ఒకతను ఉన్నాడు. అతడే శరత్ కాలం.  బూతులు కూస్తూ అదే శ్రుంగారం అనుకుంటాడు అతడు. పైగా అది మనలని నమ్మామంటాడు. అతడు అమాయకుడో అమ్మాయకుడో అర్థం కాదు. అబ్బాయకుడిని అని చెప్పుకుంటాడు. అతడు  ఎలా చెప్పుకున్నా, మనం ఒకటి మాత్రం చెప్పవచ్చు, మనిషికి ఉండాల్సిన కొన్ని కనీస మాన మర్యాదలు కొద్దిగా తక్కువ అతడికి. ఉదాహరణ చెప్పాలంటే, తన భార్య గురించి అవతలి వాళ్ళు ఏమని అనుకుంటారో అని కూడా ఆలోచించకుండా అతడు రాసే రాతలు. అతడి బ్లాగులు చదవకపోవడం ఆమె అద్రుశ్టం. ఈ మధ్య అతడు రాసిన పోస్టు చూశారా? ఆడవాళ్ళు తమని మొదటిసారి రేప్ ఎప్పుడు చేశారు, ఎవరు చేశారు వగైరాల లాంటివి తమ బ్లాగుల్లో రాయాలని భోధించాడు!!  ఇలాంటి మెంటాలిటి ఉన్నవాడు మనిషేనా అని అనుమానంతో (?) పెట్టటం తప్పా చెప్పండి. అలాగే తను అమెరికా వెళ్ళినప్పుడు సరైన మర్యాదలు చెయ్యలేదని అతడు ఒకరిద్దరు బ్లాగర్ల మీద క్రూరమైన నిందలు వేశాడు.

ఇవన్నీ వాల్లు రాసుకుంటే నీకు బాధ ఏంటి? నీకు నచ్చకపోతే చదవకు అని అనవచ్చు. ఒకవేళ అది సరి అయిన మాట అయితే, ఈ లోకంలో విమర్శ అనేదే ఉండకూడదు కదా! ఏమంటారు? పుస్తకంపై రివ్యు రాసేవాడిని నీకు నచ్చకపోతే చదవొద్దు, సినిమా రెవ్యు రాసేవాడికి  నీకు నచ్చకపోతే చూడొద్దు అని చెబుతారా?