Monday, August 23, 2010

ఒంగోలు శ్రీను గారూ!

ఒంగోలు శ్రీను గారూ!
బాగా రాశారండీ! కాకపోతే మీ అమాయకత్వం పతాక స్థాయికి చేరటం, ఆలోచనాశక్తి పాతాళానికి పడిపోవటం - రెండూ ఒక్కసారే జరగాయేమోనని నా సందేహం. సరిగ్గా ఆ సమయాల్లోనే మీరు పోస్ట్ లు రాస్తున్నారనుకుంటా. పోస్టుల్లో మీరు పొరపాట్లు రాసినా ఎవరికీ ఇబ్బంది కలగనంతవరకూ ఒ.కె. కానీ ఆ పొరపాటు రాతల కారణంగా సాటి బ్లాగర్లు ఎందుకు ఇబ్బంది పడాలి? "ఇబ్బంది పడ్డారా, ఎలాగ?" అని మీరు అడగవచ్చు. ఈ ఉదాహరణ చూడండి:

ఈ బ్లాగ్ రాసేవాళ్ళెవరో మీకు తెలియదు. ఎంతమందో తెలియదు. తెలియనప్పుడు తెలియనట్లుగానే ఉండాలి. కానీ ఊహించారు. సరే ఊహలు చెయ్యవచ్చు.. కానీ మీ ఊహే నిజమనుకుని వాళ్లను ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు. అది రైటా? మీ తెలివి తక్కువ తనం కాకపోతే, ఏమిటండీ ఆ మాటలు? మాలిక పాపులర్ అవుతుందని భయపడి మిమ్మ్లల్ని అన్పాపులర్ చెయ్యాలని భారారె ఈ బ్లాగ్ పెట్టాడా? నవ్వు రావటం లేదూ ఆ ఆలోచనకే? భారారె పగలబడి నవ్వుకుని ఉండాలి, మీ తెలివి తక్కువ తనానికి! మాలిక రావటంతో హారానికి వస్తున్న కోట్లాది రూపాయల ఆదాయానికి గండి పడిపోతుందనా ఆయన భయపడాల్సింది?

కానీ ప్రతి గొడవలోకీ కోతి, పెన్ను, కత్తీ అంటూ మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ హింస పెడుతూ ఉన్నారే - మీరు పెట్టిన హింసకు మాత్రం భారారె లాగా నవ్వుకునే పరిస్థితి వాళ్లకు ఉందని అనుకోనండి! చూసేవాణ్ని నాకే కష్టంగా ఉంటుంది మీ ఆరోపణలకు. వాళ్లకు ఎల్చా ఉంద్డోగాని. వాళ్ల రాతలు, వ్యాఖ్యలూ నచ్చని వాళ్లు చాలామంది ఉన్నారు. అంత మాత్రాన, వాళ్లు మీలాగా ప్రతీ దానికీ వాళ్లపై ఇలా అవాకులూ చెవాకులూ రాస్తున్నారా?

>అక్కడ నేను పెట్టిన కామెంట్స్ అంటారా ... అతను రాసిన కొని విషయాలకి అతని సెన్సాఫ్ హ్యూమర్ కి మనలో చాల మంది మెచ్చుకుని ఈ టాలెంట్ సక్రమ మార్గం లో వాడితే బాగుండేది అనుకున్నాం కాదనలేని నిజం.>> - ఎంత గొప్ప నిజాన్ని రాశారు!! అద్భుతమైన వాక్యాలు ఒంగోలు శ్రీను గారూ! కాగడా బూతులు రాసింది మీపైన కాదుగదా, అందుచేత అతడి సెన్సాఫ్ హ్యూమరుకు ఆనందించారు. అతగాణ్ని దారిలో పెడదామని ప్రోత్సహిస్తూ కామెంటు రాశారు. మరి నా బ్లాగులో బూతులు ఎందుకు రాశారు? నన్ను కూడా అభినందించి ప్రోత్సహించాల్సింది కదా? తేడా ఏమిటో తెలుసా -ఇక్కడ టార్గెట్ మీరు! ఇక్కడ కూడా నేను వాళ్లల్నే తిట్టి ఉంటే.., "ఎయ్యి బాసూ ఇరగదీయ్" అంటూ మీరే కామెంట్లు రాసి ఉండేవారు. నా writing skills ను ప్రోత్సహించి మంచిదారిలో పెట్టాలి గదా మరి!!

మీ హిపోక్రసీకి సిగ్గనిపించటం లేదూ, ఒంగోలు శ్రీను గారూ?

ప్రవీణ్ మిమ్మల్ని తిట్టినపుడు ’ఏదోలే అమాయకుడు’ అని వదిలెయ్యకుండా, అతన్ని ప్రోత్సహించకుండా మీరు అతని మీద తిరగబడ్డారేంటి? మీ దాకా వస్తే ఒక పద్ధతి, అవతలి వాళ్లకు జరుగుతుంటే ఒక ధోరణీనా?

మీది ఎంత హిపోక్రసీయో తెలుస్తుందా, ఒంగోలు శ్రీను గారూ?

>ఆయన గారు నన్ను అడ్డమైన మాటలు అనగా లేనిది నేను సరదాగా ఒక పోస్ట్ పెడితే .. చూడండి ఎంత గొడవ చేస్తున్నాడో?>> - ఆయన అడ్డమైన మాటలు అంటే, మీరు సరదాగా ఒక పోస్టు పెట్టారా? మరి మీరు పెన్ను, కోతి, కత్తులు అంటూ రాసిన రాతలకు వాళ్లు ఏం చెయ్యాలి? పాపం, వాళ్లు మౌనంగా సహించారు తప్ప, ఏమీ చెయ్యలేదు.

వాళ్లు కూడా మీలాగే అనుకుని ఉంటే, ఎంత రచ్చ జరిగి ఉండేది, ఒంగోలు శ్రీను గారూ?

>మీ బ్లాగు వీక్షణం లో అజ్ఞాతలు నను అడ్డమైన కూతలు కూస్తే మీరు డిలీట్ చెయ్యరు కానీ నా బ్లాగులో మీ ఫేక్ పేర్లు పెట్టుకుని తిట్టే వాళ్ల గురించి మాట్లాడుతారు.>> - కష్తం కలిగింది కదూ! ఔను, నిజంగా కష్టంగానే ఉంటుంది తమ్ముడూ. మీరు రాసిన రాతలకు అవతలి వాళ్లకు ఎంత కష్టం కలుగుతుందో తెలిసింది కదూ! తీసేస్తాను. వాటన్నిటినీ తీసేస్తాను. కానీ దానికంటే ముందు మీరొక పని చెయ్యాలి. నా మొదటి పోస్టులో, మీరు స్వంత ఐడీని బైట పెట్టటానికి ముందు anon comments రాసింది మీరేనన్న నిజాన్ని ఒప్పుకోండి, వెంటనే తీసేస్తాను. నేను అక్కడే చెప్పాను, ఆ anon మీరేనని.


>ప్రవీణ్ తప్పులు ప్రశ్నిస్తే ఇప్పుడు ధూమ్ కాగాడాలని తెర మీదకి తెచ్చారు . ఇక మిగతాది మీ విజ్ఞత కె వదిలేస్తున్నా>> - శ్రీను గారూ, మీరు అమాయకత్వం నటిస్తున్నారా లేక నేను మొదటి పేరాలో రాసినట్లుగా నిజంగానే అది శిఖరస్థాయిలోఉందా? మీ గ్రూప్ లీలల్లో ప్రవీణ్ ఎపిసోడ్ చాలా చిన్నది బాబూ. మీకు తెలియంది చాలా ఉంది. మీకు త్వరలోనే తెలియాలని కోరుకుంటున్నాను!

>బలవంతంగా అయినా గౌరవ పరమైన భాషతో ఇక నుండి ఆవేశపడటం అలవాటు చేసుకుంటాలెండి>> - మంచిగా మారేందుకు ఎంతలా కష్టపడాల్సి వస్తోందో చూశారా? :-) Anyway, all the best! I hope, you will change for the better and.. change for good.

చివరగా నాది ఒక మాట - బ్లాగుల్లో గ్రూప్స్ ఉన్నాయి వాళ్లను ఎదుర్కోవాలి అంటూ మీరు గ్రూప్స్ పెట్టి అడ్డమైన చెత్త రాశారు కాని, నిజానికి గ్రూప్స్ మొదలుపెట్టుంది మీరు. గ్రూప్ గా చేరి, సాటి బ్లాగర్లను అవమానించింది మీరు.

ఇక మీతో నా పని అయిపోయింది. బై!

2 comments:

  1. what you said is completely correct. hats off to you for taking time and exposing their stupidities. They are the founders of GROUPISM in this blog world. Not just GROUPISM - NASTY GROUPISM. They are responsible for the chaos in blogworld. I support you on all your blog posts. They just enjoy making others suffer a lot. We don't need these people around us. Stupid guys.

    ReplyDelete